Hyderabad: వేయి మంది కేసీఆర్ లు వచ్చినా ప్రధాని మోదీని అడ్డుకోలేరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం బేగంపేట విమానాశ్రయంలో ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మోడీకి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీకి స్వాగతం పలుకుతున్నారని అన్నారు. మహిళ అని చూడకుండా గవర్నర్ ను ఆవమానిస్తారని, ఏ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి లేదన్నారు. సీఎంకు రాష్ట్ర అభివృద్ది పట్టదు. నా తర్వాత నా కుటుంబం మాత్రమే అధికారంలో ఉండాలనే ఆకాంక్ష వుందని విమర్శించారు.
మోదీ హైదరాబాద్ వస్తె కనీస మర్యాద ఇవ్వకపోగా మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కడుతరు. నీ కిరాయి మనుషులతో బ్యానర్స్ కట్టినంత మాత్రాన మోదీని అడ్డుకోలేరంటూ మండిపడ్డారు. నీ తాటాకు చప్పులకు భయపడేది లేదు. మళ్ళీ మళ్ళీ రాష్ట్రానికి మోదీ వస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేసారు. కొమరం భీం మ్యూజియంకు ఇప్పటి వరకు లాండ్ కేటాయించలేదు. ఎంఎంటీఎస్ రెండవ విడత లైన్ కు స్థలం ఇవ్వకుండా ప్రధాని మోదీని విమర్శిస్తారా? అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు.