Janasena Party : తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన.. ఎన్ని స్థానాల్లో పోటీ అంటే ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్దమని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తాము పోటీచేసే స్థానాల జాబితాను తాజాగా విడుదల చేసింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ

  • Written By:
  • Publish Date - October 2, 2023 / 07:37 PM IST

Janasena Party : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్దమని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తాము పోటీచేసే స్థానాల జాబితాను తాజాగా విడుదల చేసింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ లక్ష్యమని.. మొత్తంగా 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్టు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఒకవేళ చివరి క్షణంలో పొత్తులేమైనా ఉంటే ఈ స్థానాల్లో మార్పులు ఉండొచ్చని జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ప్రకటించారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 9 స్థానాల్లో పోటీ చేస్తుండడం గమనార్హం.

జనసేన పోటీ చేసే నియోజకవర్గాల వివరాలు..

1. కూకట్ పల్లి

2. పటాన్ చెరు

3. ఎల్బీ నగర్

4. సనత్ నగర్

5. ఉప్పల్
6. కుత్బుల్లాపూర్
7. శేరిలింగంపల్లి

8. మల్కాజిగిరి

9. మేడ్చల్

10. మునుగోడు

11. ఖమ్మం
12. వైరా
13. నాగర్ కర్నూలు
14. కొత్తగూడెం
15. అశ్వరావుపేట
16. పాలకుర్తి
17. నర్సంపేట
18. స్టేషన్ ఘన్ పూర్
19. హుస్నాబాద్
20. రామగుండం
21. జగిత్యాల
22. నకిరేకల్
23. హుజూర్ నగర్
24. మంథని
25. కోదాడ
26. సత్తుపల్లి
27. వరంగల్ వెస్ట్
28. వరంగల్ ఈస్ట్
29. ఖానాపూర్
30. పాలేరు
31. ఇల్లందు
32. మధిర