Site icon Prime9

Megastar Chiranjeevi: చిన్నారి పై లైంగిక దాడి ఘటన కలిచివేసింది.. సినీనటుడు చిరంజీవి

Incident of sexual assault on a child shocked me

Incident of sexual assault on a child shocked me

Hyderabad: హైదరాబాదు బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాలలో చిన్నారి పై లైంగిక దాడి ఘటన కలిచివేసిందని ప్రముఖ నటుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన పై స్పందించిన చిరంజీవి, చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడటం అమానుషంగా పేర్కొన్నారు.

మృగాళ్ల వికృత చేష్టలకు కఠిన శిక్షలు విధించడమే సరైన చర్య అని ఘాటుగా వ్యాఖ్యానించారు. విద్యాసంస్థల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. భావితరాలకు భరోసా కల్పించడం మనందరి బాధ్యత అని చిరంజీవి అన్నారు.

డీఏవీ పాఠశాలలో చోటుచేసుకొన్న ఘటన పై ఇప్పటికే ఇద్దర్ని జైలుకు పంపారు. మరోవైపు ఏకంగా పాఠశాల గుర్తింపును కూడా ప్రభుత్వం రద్దు చేసింది. అయితే కొంతమంది తల్లి తండ్రులు గుర్తింపు రద్దును వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి లైంగిక దాడి పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఇది కూడా చదవండి:Sabitha Indra Reddy: బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు.. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి

Exit mobile version