Site icon Prime9

Congress: కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి బహిష్కరణ

Congress

Congress

Hyderabad: మాజీ మంత్రి, మర్రి శశిధర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

శశిధర్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు శనివారం మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని నయమవడానికి చాలా  సమయం పడుతుందని కూడ వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైఖరివల్ల చాలా మంది నాయకులు పార్టీని వీడే అవకాశముందని కూడ అన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వొద్దని తాను కూడా చెప్పానని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికను కూడా రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకోలేదని విమర్శించారు

Exit mobile version