Hyderabad: కొత్త రూపురేఖలతో సబ్బండ వర్గాల తెలంగాణ తల్లిని కాంగ్రెస్ వర్గాలు తయారుచేయించాయి. సెప్టంబర్ 17న రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయడానికి కాంగ్రెస్ సన్నహాలు చేస్తోంది. ఈ సందర్బంగా తెలంగాణ తల్లి ఫొటోలను సోషల్ మీడియాలో కాంగ్రెస్ విడుదల చేసింది. కొత్తగా రూపొందిస్తున్న తెలంగాణ తల్లిలో కుడి చేతిని ఎత్తి ఆశీర్వదిస్తున్నట్లు, ఎడమ చేతిలో కర్రపట్టుకొని సిగతో, నుదుట తిలకం, సాంప్రదాయ చీరకట్టుతో నిలబడిన విగ్రహం అందరిని ఆకర్షించేలా రూపొందించారు.
తెలంగాణ రాష్ట్రసమితి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం రూపు రేఖలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నెత్తిన బంగారు కిరీటం, వజ్ర వైఢూర్యాలను ధరించి రాచరికానికి ప్రతిరూపంగా రాజదర్పాన్ని కలిగి ఉందని ఆక్షేపిస్తోంది. తెలంగాణ తల్లి కష్టజీవి, ఊరి సంస్కృతికి ప్రతిరూపమని కాంగ్రెస్ పేర్కొంది.