Cm Kcr : దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం మనకు వద్దు అంటూ ప్రతిపక్షాలపై తనదైన శైలిలో సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చాయని ఆగం ఆగం కావొద్దని అన్నారు. తమ నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థి గుణగణాలు కూడా ప్రజలు పరిశీలించాలని, ఆయన ఉన్న పార్టీ విధానాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పచ్చి అబద్ధాలు చెబుతూ.. అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.
Cm Kcr : దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం మనకు వద్దు అంటున్న సీఎం కేసీఆర్..

Cm Kcr fires on oppositions at aswaraopet meeting