Prime9

Amit Shah : తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..!

Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణలో పర్యటన చేయనున్న విషయం తెలిసిందే. ఆగస్టు 27న రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా పేరిట నిర్వహించే సభలో అమిత్ షా హాజరు కానున్నారు. అలానే ఈయన సమక్షంలో  పలువురు నేతలు కాషాయ కండువాలు కప్పుకొని బీజేపీలో చేరనున్నారు. ఈ క్రమంలోనే అమిత్ షా పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

అమిత్ షా పర్యటన వివరాలు…

ఢిల్లీ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు చేరిక.

గన్నవరం నుంచి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 2.10 గంటలకు కొత్తగూడెం రాక.

అక్కడ్నించి రోడ్డు మార్గంలో భద్రాచలం పయనం.

మధ్యాహ్నం 2.40 గంటల వరకు భద్రాచలం సీతారాముల ఆలయంలో ప్రత్యేక పూజలు

తిరిగి భద్రాచలం నుంచి రోడ్డు మార్గంలో కొత్తగూడెం చేరిక. అక్కడ్నించి మధ్యాహ్నం 2.55 గంటలకు బీఎస్ఎఫ్ హెలికాప్టర్ లో ఖమ్మం పయనం.

మధ్యాహ్నం 3.30 గంటలకు ఖమ్మం చేరిక.

మధ్యాహ్నం 3.45 గంటల నుంచి 4.35 గంటల వరకు ఖమ్మంలో జరిగే రైతు గోస-బీజేపీ భరోసా బహిరంగ సభకు హాజరు.

అనంతరం బీజేపీ కోర్ కమిటీ సమావేశం.

సాయంత్రం 5.45 గంటలకు హెలికాప్టర్ లో గన్నవరం చేరిక.

గన్నవరం నుంచి సాయంత్రం 6.25 గంటలకు ఢిల్లీ తిరుగు ప్రయాణం.

Exit mobile version
Skip to toolbar