Site icon Prime9

Raithu Bandhu : బీఆర్ఎస్ సర్కారుకు బిగ్ షాక్.. రైతు బంధు పంపిణీకి బ్రేక్ !

central election commission shocking decision about Raithu Bandhu

central election commission shocking decision about Raithu Bandhu

Raithu Bandhu : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ సర్కారుకి కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. గతవారం రైతుబంధు (Raithu Bandhu) నిధుల పంపిణీకి అనుమతినిచ్చిన ఎన్నికల సంఘం ఇప్పుడు అనుమతిని ఉపసంహరించుకుంది. దీంతో బీఆర్ఎస్ సర్కారుకు భారీ షాక్ తగిలినట్లు అయింది. అంతకు ముందు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రైతుబంధు నిధుల పంపిణీ ఆపివేయాలంటూ ఎన్నికల సంఘం ఆదేశించింది. కానీ దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదనలు పంపడంతో నిధుల విడుదలకు అనుమతినిచ్చింది. నవంబర్ 28వ తేదీ లోపు రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని సూచించింది.

కాగా 26, 27 తేదీలలో బ్యాంకులకు సెలవులు కావడంతో 28వ తేదీ నాడు సుమారు 7000 కోట్ల రూపాయల రైతు బంధు నిధులు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయ్యింది. అయితే తాజాగా వెలువడిన ఆదేశాలతో రైతుబంధు నిధుల పంపిణీ నిలిచిపోయింది. రెండు రోజుల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు నిధులు విడుదల చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని ఈసి స్పష్టం చేసింది. దీంతో రైతుబంధు నిధుల పంపిణీ ఆగిపోయింది.

వాస్తవానికి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి కౌంటింగ్ ముగిసే వరకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అమలులో ఉండవు. అందులో భాగంగానే మొదట రైతుబంధు (Raithu Bandhu) ను నిలిపివేసినప్పటికీ.. తాజాగా పంపిణీకి అనుమతి లభించడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ విజ్ణప్తి మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. మొదట రైతుబంధు నిధుల పంపిణీని ఆపివేసి, ఆ తర్వాత మళ్లీ అనుమతి ఇవ్వడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ కు దీనిమీద ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 30వ తేదీ పోలింగ్ పెట్టుకొని.. 28వ తేదీ లోపు రైతుబంధు నిధులకు అనుమతి ఇవ్వడమేమిటంటూ.. ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ అనుమతి ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణలో ఏటా ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్‌లకు మొత్తం రూ.10 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ఈసారి శాసనసభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ప్రభుత్వం నుంచి యాసంగి సీజన్‌కు నిధుల జమ జరగలేదు. 2018లోనూ ఇలాగే ఎన్నికల ముందు రైతు బంధు నిధులను విడుదల చేశారు.

Exit mobile version