Site icon Prime9

Supreme Court: అసెంబ్లీ సీట్ల పెంపు పై విచారణకు సుప్రీం ఓకే

Supreme OK for inquiry on increase of assembly seats

Supreme OK for inquiry on increase of assembly seats

New Delhi: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం కోర్టు ఓకే చేసింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికల కమీషన్ కు సర్వోత్తమ న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విభజన చట్టంమేరకు ఏపీలో 175 నుండి 225, తెలంగాణాలో 119 నుండి 153కు అసెంబ్లీ సీట్లు పెంచాలని పిటిషన్ దాఖలైంది. ఈ నెల చివరిలో ఇందుకు సంబంధించిన విచారణ న్యాయమూర్తులు చేపట్టే అవకాశం ఉంది.

జమ్ము, కాశ్మీర్ ప్రాంతాల్లోని అసెంబ్లీ సీట్లను పెంచుతూ కేంద్రం ప్రత్యేక ఆదేశాలను చేసింది. దీనిపై ఓ డీలిమిటేషన్ కమిటీను కూడా వేసారు. ఈ క్రమంలోనే అక్కడి అసెంబ్లీ సీట్లను పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. ఈ నేపధ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Exit mobile version