Pawan Kalyan Comments:ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు .తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో పొత్తు ధర్మం ప్రకారం అలా ప్రకటించకూడదని కామెంట్ చేశారు . ఆశావహులు టికెట్ల విషయంలో తనను కూడా ఒత్తిడి చేస్తున్నారని అన్నారు పవన్ .
నాపై కూడా ఒత్తిడి ఉంది..(Pawan Kalyan Comments)
చంద్రబాబు మండపేటకు అభ్యర్థిని ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ కూడా రాజోలు , రాజానగరంలకు అభ్యర్థులను ప్రకటించారు . చంద్రబాబు పై వత్తిడి ఉన్నట్లు తనపై కూడా ఒత్తిడి ఉందని అందుకే ఈ రెండు సీట్లకు తాను కూడా అభ్యర్దులను ప్రకటించవలసి వచ్చిందన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై ఉన్న ఒత్తిడిని అర్థం చేసుకోగలను.కూటమితోనే జగన్ కుంభస్థలాన్ని కొడతాం.వైఎస్ జగన్‌కు ఊరంతా శత్రువులే.జగన్ మళ్లీ వస్తే రాష్ట్ర అధోగతి పాలే.జగన్‌పై నాకు వ్యక్తిగత శత్రుత్వం లేదు.ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టమని విడదీయడం సులభమని అన్నారు. సీఎం పదవి గురించి లోకేష్ మాట్లాడినా కూడా తాను స్పందించలేదన్నారు. కొన్ని అనుకోకుండా జరుగుతాయని వాటి గురించి పట్టించుకోవలసిన అవరం లేదన్నారు. ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందన్న ఉత్సుకత సర్వత్రా నెలకొంది.