Site icon Prime9

Janasena Membership : జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు.. మీరు కూడా సభ్యత్వం తీసుకోవాలనుకుంటే?

interesting details about janasena membership

interesting details about janasena membership

Janasena Membership : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై గట్టిగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే నియోజకవర్గల వారీగా కమిటీలను నియమించిన పవన్.. ఇప్పుడు  క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికులు, వీరమహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మొదటగా 2020 సెప్టెంబర్‌ నెలలో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. అప్పుడు దాదాపు లక్షమందికి పైచిలుకు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారన్నారు పవన్. తాను క్షేత్రస్థాయిలో గమనించానని.. పార్టీ కోసం ఎంతో కష్టపడి.. అభిమానంతో పని చేసేవారు ముఖ్యంగా యువత ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడటం తన దృష్టికి వచ్చిందన్నారు. అలాగే కొంతమంది జన సైనికులు ప్రమాదవశాత్తు మరణిస్తున్నారు. ప్రమాదానికి గురైన వారికి, మరణించిన వారి కుటుంబాలకు జనసేన నాయకులు వ్యక్తిగతంగా సహాయం అందించారన్నారు.

 

ఇవన్ని చూసి జన సైనికులకు ఏదైనా చేయాలన్న తపనతో పార్టీలోని నేతలు, కార్యవర్గంతో మాట్లాడి బీమా పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ఇందుకోసం ప్రీమియం కోసం రూ.కోటి నిధిని అందజేశానన్నారు. ఇప్పటి వరకు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన 23 మంది జనసైనికుల కుటుంబాలకు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ బీమా చెక్కులు అందించారన్నారు. ఈ కార్యక్రమాన్ని సభ్యత్వ కార్యక్రమం ‘మన కోసం’ తపన పడ్డ వ్యక్తులు, కుటుంబాలకు అండగా ఉండాలని చేపట్టిందన్నారు పవన్ కళ్యాణ్. దీనిని ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జనసైనికుడు, వీరమహిళలు ముందుండి నడింపించాలని, ప్రతి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వాలు నమోదయ్యేలా కృషి చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

సభ్యత్వం నమోదు చేయించుకోవాలంటే (Janasena Membership)..?

కొత్తగా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకోవడానికి ఆసక్తి ఉన్న వారు, అలానే క్రియాశీలక వాలంటీర్లుగా బాధ్యత చేపట్టాలనుకునేవారు ఈ క్రింది నెంబర్ కు కాల్ చేసి బీప్ సౌండ్ తరువాత మీ పూర్తి పేరు, నియోజకవర్గం పేరు చెప్పగలరు అని వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక పోస్ట్ కూడా పెట్టారు.

 

 

ఇప్పటికీ రెండు విడతలుగా విజయవంతం అయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ మూడో విడతగా ఈ నెల 10వ తేదీ మొదలై 28 వ తేదీ వరకు సాగుతుంది. గత రెండు విడత ల్లోనూ పార్టీ క్రియాశీలక సభ్యులను చేర్చడం కోసం ఎంతో కష్టపడి పనిచేసిన సుమారు 6,400 మంది పార్టీ వాలంటీర్లకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మూడో విడత లోనూ బలమైన స్ఫూర్తితో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమష్టిగా ముందుకు తీసుకువెళ్లి, విజయవంతం చేయాలని కోరుతున్నాను.’  అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

 

Exit mobile version
Skip to toolbar