Janasena chief Pawan Kalyan: అత్తారింటికి దారేదో తెలిసింది కానీ.. ఏపీ రాజధానికి దారి తెలియడంలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. గురువారం సాయంత్రం విశాఖపట్నంలో జరిగిన జనసేన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధాని ఎక్కడుందో కేంద్రంలో ఉన్నవాళ్లు చెప్పాల్సి వస్తోందని అన్నారు. ఈ రోజుకు ఏపీకి రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి ఏందపి పవన్ మండిపడ్డారు.
మా ఆంధ్రా అనే భావన విశాఖలోనే మొదలైందని అన్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదం అందరినీ ఏకం చేసిందని చెప్పారు. ఇది భావోద్వేగాలకు సంబంధించిన అంశమని అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర పెద్దలకు తెలియజేసి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నామన్నారు. తాను ఈ తరాన్ని కాపాడుకుంటూ రాబోయే తరం కోసం పనిచేసేవాడినని పవన్ చెప్పారు. తాను ఓట్ల కోసం రాలేదని మార్పు కోసం ఓట్లు అడుగుతానని పవన్ అన్నారు. ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలని, కాలుష్యం తగ్గాలని అన్నారు. ఇక్కడ ఉన్న 24 బీసీ కులాలను తెలంగాణలో గుర్తించకపోయినా వైసీపీ నేతలు ఎందుకు అడగడం లేదని పవన్ ప్రశ్నించారు. తెలంగాణ యువత బలిదానాలతో రాష్ట్రాన్ని తెచ్చుకున్నారని.. 151 సీట్లు వైసీపీకి ఇస్తే ఒక్కసారి కూడా సరైన జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయారని అన్నారు. డ్రెడ్జింట్ కార్పోరేషన్ తన వల్లే లాభాల బాటలో ఉందని అన్నారు. ఏ పదవీ లేని తాను ఇంతగా పోరాడుతుంటే వైసీపీ నేతలు ఇంకా ఎంత పోరాటం చేయాలని అన్నారు. జనసేనకు ఒక్క ఎంపీ ఉన్నా స్టీల్ ప్లాంట్ కు గనులు తెచ్చేవాడినని చెప్పారు. విశాఖ ప్రజలు తనపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారని తాను ఓడిపోయినా కూడా తనకు మద్దతుగా నిలబడుతున్నారని అనన్ారు. ఏపీలో మహిళల అదృశ్యంపై తాను మాట్లాడితే ఎగతాళి చేసారని వాస్తవానికి కేంద్ర నాయకులు చెబితేనే తాను మాట్లాడానని అన్నారు. టీడీపీ- జనసేన ప్రభుత్వం వస్తే సమర్దులైన అధికారులను నియమంచి శాంతిభద్రతలను కాపాడుతామని అన్నారు. సీఎం ఎవరనేది తాను, చంద్రబాబు కలిసి నిర్ణయిస్తామని పవన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు మేలు జరుగుతుందనే గతంలో తాను బీజేపీ కి మద్దతు ఇచ్చానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.
.