Site icon Prime9

Cm Kcr Birthday : దేశ్‌కీ నేత కేసీఆర్‌.. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా పుట్టిన రోజు వేడుకలు..

cm kcr birthday celebrations in all over telangana by brs activists and fans

cm kcr birthday celebrations in all over telangana by brs activists and fans

Cm Kcr Birthday : తెలంగాణ ముద్దుబిడ్డ, సీఎం కేసీఆర్‌ నేడు 69 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, అభిమానులు కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జన హృదయ నేత కేసీఆర్‌.. ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ బీఆర్‌ఎస్‌ నేతలు.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

కేసీఆర్ కి సినీ, రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు..

ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ 69వ జన్మదినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. కాగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కేసీఆర్ కి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.  ప్రధాని మోదీ, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్,  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అలానే వెంకయ్య నాయుడు, గవర్నర్ తమిళ సై కూడా కేసీఆర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవితం అర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గౌరవనీయులైన కె చంద్రశేఖర్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు అని గవర్నర్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలతో పాటు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకుంటున్నారు.

 

 

సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని జయశంకర్ స్టేడియంలో కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ సీజన్‌-3ని సినీ నటుడు నాటి, క్రికెటర్‌ అంబటి రాయుడుతో కలిసి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. గత పదేళ్లలో సిద్దిపేటలో చూసిన అభివృద్ధి దేశంలో మరెక్కడా చూడలేదన్నారు అంబటి రాయుడు. తెలుగు వారు మరింత మంది జాతీయ క్రికెట్ ఆడాలన్నారు. మంచి కోచ్ లను ఏర్పాటు చేస్తే మరింత మంది క్రికెట్ లోకి వస్తారని, జాతీయ స్థాయిలో ఆడతారని అన్నారు. ”ఇక్కడికి రావడం తనకు సక్సెస్ సెలబ్రేషన్ కు వచ్చిన ఆనందం కలుగుతుందన్నారు హీరో నాని. 378 టీమ్ లు ఆడటం గ్రేట్ అన్నారు. ఇంత పెద్ద ఈవెంట్ బహుశా దేశంలోనే జరగలేదన్నారు.

కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా గజ్వేల్‌లో ఐదు రోజుల పాటు శ్రమించి 18 అడుగుల భారీ చిత్రాన్ని ఆవాలతో రామకోటి అనే అభిమాని రూపొందించి ఆకట్టుకున్నారు. అమెరికాలో స్కైడైవర్‌ సంతోష్‌ కేసీఆర్‌పై ఇలా గగన వీధుల గుండా తన అభిమానాన్ని చాటుకున్నారు. పారాచూట్‌ సాయంతో గాలిలో తేలియాడుతూ బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. బ్రెయిలీ లిపిలో రాసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షిప్త జీవిత చరిత్రను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్‌. ప్రపంచంలో ఎవరి చరిత్రా బ్రెయిలీ లిపిలో లేదన్నారు. ఈ మేరకు కేసీఆర్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version