Site icon Prime9

Bandi Sanjay: మోదీ వస్తున్నారంటే కేసీఆర్ గజగజ వణుకుతాడు.. బండి సంజయ్

Hyderabad: కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని, అందుకే బీజేపీని, ప్రధాని మోదీని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కు సంస్కారం లేదని, దేశ ప్రధానిని ఉద్దేశించి మాట్లాడే మాటలేనా అవి ఆయన నిలదీశారు.

ప్రజల సమస్యలపై ఎప్పుడైనా కేసీఆర్ బయటికి వచ్చారా? ఫామ్ హౌస్ దాటి బయటికి రాని ముఖ్యమంత్రి ఉండి ఎందుకు? లేక ఎందుకు అని సంజయ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో ఏక్ నాథ్ షిండే వంటి గట్టి నేతలు ఉన్నారని, అది తెలిసే కేసీఆర్ భయపడుతున్నారని, ఆ పేరును పదే పదే ఎత్తుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు, మోదీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. మోదీ రోజుకు 18 గంటలు పని చేస్తారని, కేసీఆర్. ఫామ్ హౌస్ కు వెళితే రోజులకు రోజులు బయటికే రారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రోజుకో హత్య, అత్యాచారం ఘటనలు జరుగుతున్న కేసీఆర్ పట్టించుకోవడం లేదని, మైనర్ బాలికలపై అత్యాచారం జరిగితే ఒక్కరిని కూడా పట్టుకుని శిక్షించలేకపోతున్నారన్నారు. అదే బీజేపీ ప్రభుత్వం ఉన్న యూపీలో క్రిమినల్స్ జైలు లోంచి బయటికి రావడానికి భయపడుతున్నారని, శిక్షా కాలం ముగిసినా బయటికి రావడానికి జంకుతున్నారని సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆయన పేర్కొన్నారు.

నిజాయతీతో పాలిస్తున్నందుకే 18 రాష్ట్రాల్లో బీజేపీకి అధికారం దక్కిందని సంజయ్‌ పేర్కొన్నారు..రాష్ట్రంలోనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్‌ దేశాన్ని ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. దమ్ముంటే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని ఓడించాలని సవాల్‌ చేశారు. ద్రౌపది ముర్ముకు ఓటు వేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. యూపీలో యోగీ సీఎం అయ్యాక, కాకముందు ఆయన కుటుంబం పరిస్థితి, కేసీఆర్‌ సీఎం కాకముందు, ఇప్పుడు ఆయన కుటుంబం పరిస్థితి ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పాస్‌పోర్టు బ్రోకర్‌గా ఉన్నప్పుడు కేసీఆర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టారని ఆరోపించారు. రజాకార్ల అకృత్యాలపై ఒక్కటి కాదు. నాలుగు సినిమాలు వస్తున్నాయని, వాటిని చూస్తే కేసీఆర్‌ గుండె ఆగుతుందని పేర్కొన్నారు.మోదీని చూస్తేనే కేసీఆర్‌కు కరోనా వస్తుందని సంజయ్‌ ఎద్దేవా చేశారు. ప్రధాని వస్తున్నారంటేనే గజగజ వణుకుతాడని పేర్కొన్నారు.

Exit mobile version