Site icon Prime9

Union Home Ministry: ఒక్క రాజధానికే నిధులన్న కేంద్రం

The center announced funding for only one capital

The center announced funding for only one capital

New Delhi: ఈ నెల 27న రాష్ట్ర విభజనం అంశాలపై కేంద్ర హోంశాఖ సమావేశం కానుంది. విభజన చట్టం ప్రకారం ఏపి కొత్త రాజధానికి కేంద్రం సహకారం ఇవ్వాల్సి ఉంది. తాజగా కొత్త రాజధానికి నిధులు అని మాత్రమే కేంద్ర హోంశాఖ అజెండాలో పేర్కొనింది. మూడు రాజధానుల అంశం అజెండాలో లేకపోవడం ఏపి ప్రభుత్వానికి కేంద్రం షాకిచ్చిందనే చెప్పాలి. హైకోర్టు అమరావతే ఏపి రాజధానిగా ఉంటుందని తీర్పు ఇచ్చిన్నప్పటికీ జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడాతమంటున్న సిఎం జగన్ కు అజెండాలోని అంశంతో మింగుడు పడకుండా చేసింది.

విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్ర సహకారం పై ఈ భేటీలో చర్చించబోతున్నామంటూ కేంద్ర హోంశాఖ ఏపీ, తెలంగాణకు పంపించిన అజెండాలో పేర్కొంది. రాజధాని నగరం నుంచి ర్యాపిడ్‌ రైల్‌ అనుసంధానం అంశాన్ని కూడా హోం శాఖ పొందుపరిచింది. ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం, విభజన కావాల్సిన అంశాల్లో షెడ్యూల్‌ 9లో ఉన్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు, షెడ్యూల్‌ 10లో ఉన్న రాష్ట్ర సంస్థల విభజన, విభజన చట్టంలో పేర్కొనని సంస్థల పంపిణీ, ఏపీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, సింగరేణి కాలరీస్‌, ఏపీ హెవీ మెషినరీ ఇంజనీరింగ్‌, నగదు, బ్యాంకు బ్యాలెన్సులు. విదేశీ సాయంతో చేపట్టిన ప్రాజక్టుల పై తీసుకున్న అప్పుల విభజన. తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థల నుంచి ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది.

ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ఆర్ధిక శాఖలోని రెవెన్యూ, ఎక్స్‌పెండీచర్‌, ఆర్ధిక సర్వీసులు, ఎకనమిక్‌ అఫైర్స్‌ కార్యదర్శులు, ఆహార, విద్య, వ్యవసాయ కార్యదర్శులు, పెట్రోలియం, సహజ వాయువులు కార్యదర్శి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, రైల్వే బోర్డు ఛైర్మన్‌లు ఈ సమావేశానికి హాజరు కావాలని కేంద్ర హోం శాఖ ఈ మేరకు సర్య్కూలర్ విడుదల చేశారు.

Exit mobile version