Site icon Prime9

Telangana High Court: తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఎదురుదెబ్బ

Telangana High Court

Telangana High Court

Telangana High Court: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగలింది. అవినాశ్‌రెడ్డి మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. తనను సీబీఐ అరెస్ట్‌ చేయకుండా ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌ను హైకోర్టు కొట్టేసింది.

 

స్టే ఇవ్వలేము: హైకోర్టు(Telangana High Court)

తన విచారణపై స్టే ఇవ్వాలని అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో అవినాష్‌కు చుక్కెదురైంది.

అవినాష్ తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. సీబీఐ విచారణకు సహకరించాలని అవినాశ్‌రెడ్డికి హైకోర్టు ఆదేశాలివ్వడం గమనార్హం.

దర్యాప్తు కొనసాగించవచ్చని సీబీఐకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. అదే విధంగా విచారణ ఆడియో, వీడియో రికార్డ్‌ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

విచారణ ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని స్పష్టం చేసింది.

కాగా, వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డిని సిబీఐ ఇప్పటికే నాలుగుసార్లు పిలిపించి ప్రశ్నించింది. ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి పైనా దృష్టి సారించింది.

తండ్రీకొడుకులిద్దరినీ కలిపి ప్రశ్నించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కీలక నిందితులని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది.

 

పిటిషన్ లో ఏముందంటే..(Telangana High Court)

ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ తన వాంగ్మూలాన్ని నమోదు చేస్తోందని, తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని అవినాష్ రెడ్డి వారం క్రితం..

తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా తన విచారణను ఆడియో, వీడియోల ద్వారా రికార్డు చేయాలని పిటిషన్ లో అభ్యర్థించారు.

విచారణ సందర్భంగా తన లాయర్ ను కూడా అనుమతించాలని కోరారు. తన వాంగ్మూలానికి సంబంధించిన ప్రతులను అందజేసేలా దర్యాప్తు అధికారిని ఆదేశించాలని కోరారు.

తన పై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

ఇప్పటి వరకు సీబీఐ దాఖలు చేసిన రెండు అభియోగ పత్రాల్లో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.

 

ప్రధానితో జగన్ భేటీ

మరో వైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే.

శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం అయ్యారు.

ఈ టూర్‌లో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీతో చర్చించారు. పలువురు కేంద్ర మంత్రులతో కూడా సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

 

Exit mobile version