Site icon Prime9

Supreme Court: టీడీపీ మాజీ మంత్రులకు సుప్రీం కోర్టు షాక్

Supreme Court

Supreme Court

Supreme Court: తెలుగు దేశం పార్టీకి చెందిన ఇద్దర మాజీ మంత్రులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫోర్జరీ కేసులో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయం స్థానం అనుమతి ఇచ్చింది. అదేవిధంగా పేపర్ లీకేజ్ కేసులో మాజీ మంత్రి నారాయణ పిటిషన్ కు కూడా సుప్రీం డిస్మిస్ చేసింది.

 

దర్యాప్తు కొనసాగించవచ్చు(Supreme Court)

మాజీ మంత్రి, టీడీప సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిపై ఫోర్జరీ కేసు వ్యవహారంలో దర్యాప్తు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

నర్సీపట్నంలో తన ఇల్లు నిర్మించే క్రమంలో ఎన్వోసీ కోసం నీటిపారుదల శాఖ అధికారి సంతకాలను ఆయన ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై అప్పట్లో కేసు నమోదు అయింది.

దీనిపై అయ్యన్న హైకోర్టును ఆశ్రయించారు. కొద్ది రోజుల క్రితం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఫోర్జరీ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అయిదే, ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ అధికారి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎంఆర్‌ సా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఫోర్జరీ వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. సెక్షన్‌ 41 crpc ప్రకారమే విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ కేసులో దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. మెరిట్ ఆధారంగానే ప్రధాన కేసును విచారణ చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టుకు సూచించింది.

 

సెషన్స్‌ కోర్టులోనే విచారణ చేపట్టండి: సుప్రీం

పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయ స్థానం సెషన్స్‌ కోర్టులోనే విచారణ చేపట్టాలని ఆదేశించింది.

మెరిట్‌ ఆధారంగానే విచారణ కొనసాగించాలని సూచించింది. సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వారం రోజుల్లో హైకోర్టును ఆశ్రయించే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని పేర్కొంటూ విచారణను ముగించింది.

కాగా, గత ఏడాది చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ హైస్కూల్‌ నుంచి పదోతరగతి ప్రశ్నపత్రం లీకైంది. వాట్సాప్‌ ద్వారా తెలుగు ప్రశ్నపత్రం బయటకు వచ్చింది.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నారాయణ పాత్ర ఉన్నట్లు అప్పట్లో పోలీసులు వెల్లడించారు.

అయితే, నారాయణ విద్యాసంస్థల అధినేతగా 2014 లోనే నారాయణ వైదొలిగారంటూ ఆయన న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

ఈ కేసుపై గత కొన్ని నెలలుగా జిల్లా కోర్టు, హైకోర్టుల్లోనూ విచారణ జరుగు వస్తోంది. ఇటీవల నారాయణ బెయిల్‌ను హైకోర్టు రద్దు చేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

 

Exit mobile version