Site icon Prime9

Varahi Yatra : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో.. “జనహిత” అంబులెన్స్.. స్పెషల్ స్టోరీ

special story on janahitha ambulance in janasena varahi yatra

special story on janahitha ambulance in janasena varahi yatra

Varahi Yatra : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “వారాహి” యాత్రలో జనహిత పేరుతో అంబులెన్స్ వాహనం అందుబాటులో ఉండనుంది. అత్యవసర సమయాలలో వైద్య సదుపాయం అందించే విధంగా ఈ అంబులెన్స్ లో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. 8 గంటల లైఫ్ సపోర్టుతో వెంటిలేటర్, మానిటర్ తో పాటు ఆక్సిజన్, ఎమర్జెన్సీ కిట్లు జనహితలో ఉన్నాయణి జనసేన నేతలు వెల్లడించారు. అత్యవసర మందులు, ప్రాథమిక వైద్యానికి తగిన పరికరాలు కూడా అంబులెన్స్ లో ఉన్నాయని.. డాక్టర్ లక్ష్మణరావు చిట్టెం ఈ జనహిత అంబులెన్స్ ని పర్యవేక్షిస్తారని.. వారాహి వెనుకనే వచ్చే ఈ అంబులెన్స్ లో డ్యూటీ డాక్టర్, నర్స్, డ్రైవర్ అందుబాటులో ఉండనున్నారని ప్రకటించారు.

Exit mobile version