Vizag Court: 467 సెక్షన్ వర్తించదు.. అయ్యన్న రిమాండ్ కు తిరస్కరించిన మెజిస్ట్రేట్

2 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న కారణంగా తెల్లవారుజామున నానా హడావుడి చేసి తెదేపా నేత అయ్యన్న పాత్రుడితోపాటు కుమారుడు రాజేశ్ పై సీఐడి పోలీసులు పెట్టిన కేసులో 467 సెక్షన్ వర్తించదని కోర్టు తేల్చి చెప్పింది.

Vizag: అభివృద్ధి పై రాష్ట్రంలో చర్చ జరగాల్సిన తరుణంలో, ప్రతిపక్ష నేతల పై కేసులతో కాలక్షేపం చేసేందుకు ప్రభుత్వం ఉత్సహాం చూపిస్తుంది. 2 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న కారణంగా తెల్లవారుజామున నానా హడావుడి చేసి తెదేపా నేత అయ్యన్న పాత్రుడితో పాటు కుమారుడు రాజేశ్ పై సీఐడి పోలీసులు పెట్టిన కేసులో 467 సెక్షన్ వర్తించదని కోర్టు తేల్చి చెప్పింది.

అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చారు. నిబంధనలకు విరుద్ధంగా అయ్యన్నను అరెస్ట్ చేశారని ఆయన తరుపు న్యాయవాదులు వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి, అయ్యన్న రిమాండ్ ను తిరస్కరించారు. 41ఏ నోటీసు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవచ్చని ఆదేశించింది. మరో వైపు ఇదే కేసులో లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో రేపు విచారణ జరగనుంది. కేసుకు సంబంధించిన డైరిని సమర్పించాలని సీఐడీ అధికారులను ధర్మాసనం ఆదేశించింది.

ఇది కూడా చదవండి: AP High Court: అయ్యన్నపాత్రుడు బెయిల్ పిటిషన్‌ పై విచారణ శుక్రవారానికి వాయిదా