Prime9

Janasena : పవన్ కళ్యాణ్ “వారాహి” అంటేనే వైకాపా ఒణుకుతుందా.. తెరమీదకు సెక్షన్ 30 యాక్ట్ ?

Janasena : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. వారాహిపై ఎన్నికలకు సమర శంఖం పూరించేందుకు రెడీ అయ్యారు. ఈ తరుణంలోనే ఈనెల 14 నుంచి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధి లోని కత్తిపూడి నుంచి భారీ బహిరంగ సభతో వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా అమలాపురం, కొత్తపేట పోలీస్  సబ్‌ డివిజన్‌ ల ప‌రిధిని దాటి చించినాడ బ్రిడ్జి ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలోకి ఈ యాత్ర కొనసాగనుంది.

అయితే మొదటి నుంచి పవన్ వారాహి యాత్రను అడ్డుకునేందుకు అధికార వైకాపా.. అన్నీ విధాలుగా ఎత్తుగడలు వేస్తూనే ఉంటుంది. ఈ కోవలోనే ఇప్పటి వరకు జరిగిన ఎన్నో నాటకీయ పరిణామాలను మనం గమనించవచ్చు. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యే లు అంతా వారాహిని ఏపీలో రోడ్లపై తిరగనివ్వమని సవాళ్ళు విసిరినప్పటికి.. పవన్ “మనల్ని ఎవడ్రా ఆపేది” అంటూ మొత్తానికి యాత్రకి సిద్దమైన తరుణంలో ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మరో ఎత్తుగడని ప్రయత్నించినట్లు కనిపిస్తుంది.

Image

అమలాపురం అల్లర్ల కారణంగా దాదాపు ఆరు నెలల పాటు అమలులో ఉన్న సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ ను పరిస్థితులు సర్దుమనగడంతో దశలు వారీగా ఎత్తివేశారు. అయితే అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్‌, కొత్త‌పేట డీఎస్పీ కేవీ ర‌మ‌ణ  పేరుతో అమలాపురం, కొత్తపేట పోలీస్ సబ్‌ డివిజన్‌ పరిధిలో జూన్‌ 10 అర్ధరాత్రి నుంచి  సెక్షన్‌ 30 అమల్లో ఉంటుందని పోలీసులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ ఆంక్షలు ఈనెల 30 వరకు అమల్లో ఉంటుందని ఆ ప్రకటలో తెలిపారు. కొత్తపేట పోలీసు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి  కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం, పి గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, నగరం, రాజోలు, సఖినేటిపల్లి మల్కిపురం,  పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఈ యాక్ట్ వర్తిస్తుందని వెల్లడించారు.

ఈ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా సభలు సమావేశాలు ఊరేగింపులు వంటివి జరగడానికి వీల్లేదని.. ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆ నోట్ లో తెలియజేశారు. ప్రస్తుతం అమలాపురంలో ప్రశాంత వాతావరణం నెలకొన్న తరువాత దాదాపు మూడు నెలల కిందట ఎత్తేసిన సెక్షన్‌ 30 ఇప్పుడు అకస్మాత్తుగా తెరమీదకు తీసుకురావడం పట్ల జనసేన – వైకాపా నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్రను అడ్డుకునే ప్రయత్నంలో భాగమే సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ ప్రయోగమని జనసేన (Janasena) నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. చూడాలి మరి దీనిపై పవన్ ఏ విధంగా స్పందిస్తారో అని..

YouTube video player

Exit mobile version
Skip to toolbar