Site icon Prime9

Producer BVSN Prasad : జనసేన పార్టీలో చేరిన ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్..

Producer BVSN Prasad joined in pawan kalyan janasena party

Producer BVSN Prasad joined in pawan kalyan janasena party

Producer BVSN Prasad : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.. పవన్ కళ్యాణ్ నేతృత్వం లోని జనసేన పార్టీలో చేరారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై స్టార్ హీరోలు, యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మంచి సినిమాలను అందిస్తున్నారు. ఈ బ్యానర్ లో మొదటగా నట భూషణ్ “శోభన్ బాబు” ‘డ్రైవర్ బాబు’ సినిమాని తెరకెక్కించి నిర్మాతగా కెరీర్ ని ప్రారంభించారు. ఆ తరావ్త వరుసగా సినిమాలను నిర్మిస్తూ దూసుకుపోతున్నారు.

సినీ రంగం లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా కొన్నాళ్ళు ప్రయాణం చేశారు ప్రసాద్. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆయన జాయిన్ అయ్యారు. ఆ పార్టీ తరుపున పోటీ చేయకపోయినప్పటికీ.. కార్యకర్తగా ఎన్నో సేవలు అందించారు. మెగాస్టార్ వెంట పార్టీ ఉన్నంత కాలం నడుస్తూ వచ్చారు. ఇక ప్రజారాజ్యం విలీనం అనంతరం పూర్తిగా మళ్ళీ సినిమా రంగంలోనే బిజీ అయ్యారు. అయితే ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీలో బీవీఎస్ఎన్ ప్రసాద్‌ అధికారికంగా జాయిన్ అయ్యారు.

ఈ మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కండువా కప్పి బీవీఎస్ఎన్ ప్రసాద్ ని పవన్ ఆహ్వానించారు. అయితే ప్రసాద్ ఈసారి కూడా పార్టీ కార్యకర్తగానే ఉంటారా? లేదా ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

 

 

ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాల విషయానికి ప్రభాస్ తో ఛత్రపతి, రామ్ చరణ్ తో మగధీర, పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన ప్రసాద్.. ఇటీవలే ‘విరూపాక్ష’ సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ తో గాండీవధారి అర్జున సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version