Prime9

Pawan Kalyan: ప్రధాని మోదీ పై జనసేనాని ప్రశంసలు

Andhra Pradesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పై ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురిపించారు. ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్థానానికి అద్దం పడతాయని అన్నారు.

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని ఎనిమిది సంవత్సరాల తరవాత మళ్ళీ కలిశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులను, సమస్యలను వివరించేందుకు అత్యంత విలువైన సమయాన్ని కేటాయించిన శ్రీ మోదీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సమావేశాన్ని సమన్వయపరచిన ప్రధానమంత్రి కార్యాలయానికి ధన్యవాదాలు అంటూ పవన్ ట్వీట్ చేసారు.

పవన్ కల్యాణ్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో విశాఖలో సమావేశం అయ్యారు. అరగంట పాటు జరిగిన సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ ఏపీకి మంచి రోజులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

Exit mobile version
Skip to toolbar