Site icon Prime9

Vijayasai Reddy: జైల్ కు వెళ్ళేవారంతా నేరస్తులు కాదు.. విజయ్ సాయిరెడ్డి

Not all who go to jail are criminals

Vizag: తెదేపా శ్రేణులను, తప్పులను ఎత్తిచూపే మీడియాను అధికార పార్టీ శ్రేణులు ఎల్లో మీడియాగా చిత్రీకరించే సంగతి అందరికి తెలిసిందే. విశాఖలో వైకాపి ఎంపీ విజయసాయిరెడ్డి అక్రమాలు, ఆరోపణల పై మీడియా, పత్రికల్లో వస్తున్న కధనాలతో ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ట్విటర్ లో ఆయన చేసిన ఓ పోస్టు సీఎం జగన్ ను రోడ్డు పైకి విజయసాయి తీసుకొచ్చాడా అన్నట్లుగా నెటిజన్లు ఆటాడుకొంటున్నారు.

ఆయన వ్యాఖ్యల్లో జైలుకు వెళ్ళే వారంతా నేరస్తులు కాదురా ఎల్లోస్! అలా అయితే గాంధీజీ నుంచి చిదంబరం వరకు అందరూ నేరస్తులే అవుతారు. కోర్టులో నేర నిరూపణ జరిగి శిక్షపడితేనే నేరస్తుడు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతోంది పచ్చ కుల మీడియా అంటూ తనలోని అక్కసు వెళ్లగక్కారు.

ప్రజల కోసం జైలుకు వెళ్లేవారు నేరస్థులు ఎప్పటికీ కారు. కాని ఆర్ధిక నేరాలు చేసిన్నట్లుగా కేసు నమోదైన అనే కేసుల్లో జైలు శిక్షను అనుభవించినవారే అధికంగా ఉన్నారు. అలాంటప్పుడు బెయిల్ పై బయటవున్న మీరు బెయిల్ రద్దు చేసుకొని తీర్పును వెంటనే ఇవ్వమని సీబీఐకి సూచించవచ్చు గదా, ఈ లాజిక్ ను విజయసాయి మిస్సయిన్నట్లుందని పలువరు నెటిజన్ల కామెంట్లతో ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు.

ఇది కూడా చదవండి. Mla Kannababu Raju: కన్నబాబు వద్దు.. జగనన్న ముద్దు.. యలమంచిలి ఎమ్మెల్యేకు వైసీపీ సర్పంచ్ షాక్

Exit mobile version