Vijayawada: ఏపీలో పోలీసులు ప్రభుత్వ పోలిసింగ్ గా మారారని ఆరోపిస్తున్న ప్రతిపక్షాల వ్యాఖ్యలను నిజమేనని అనుకొనేలా కొన్ని సంఘటనలు అద్దం పడుతున్నాయి. గత వారం రోజులుగా అధికార పార్టీ వైకాపా, జనసేన పార్టీ రెండింటి మద్య మాటలు యుద్ధాన్ని తలపించాయి. మరొక్కసారి తన గురించి తప్పుగా మాట్లాడితే వైకాపా శ్రేణులను చెప్పుతో కొడతానని పవన్ పబ్లిక్ గా ఆ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. దానికి సీఎం జగన్ తీరుబడిగా ఆలోచించుకొని రెండు రోజుల తర్వాత కౌంటర్ కూడా ఇచ్చారు.
ఈ రెండు ఘటనలతో రాష్ట్రంలో పలు చోట్లు రెండు పార్టీల కార్యకర్తలు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకొన్నారు. ఈ క్రమంలోనే జనసేన కార్యకర్తల పై పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించారు. విజయవాడ పశ్చిమ నియోజవక వర్గ పరిధిలో వైకాపా, జనసేన నాయకులు ఒకరి అధినేతపై మరొకరు ఇరువురు దిష్టి బొమ్మలను దగ్ధం చేసుకొన్నారు. తొలుత జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిష్టి బొమ్మను వైకాపా కార్యకర్తలు దగ్ధం చేశారు. అప్పుడు ఎలాంటి కేసు నమోదు చేయని పోలీసులు వైకాపాపై నో కేస్ అంటూ వ్యవహరించారు. అనంతరం జనసేన సైనికులు జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీనిపై ప్రభుత్వ పోలీసింగ్ గా వ్యవహరిస్తూ 15 మంది జనసేన నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టూ టౌన్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జగన్ అండ్ టీం తొలి నుండి ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. స్వయానా మంత్రులే అసభ్యకరంగా మాట్లాడి తెలుగుజాతి పరువును మంటగలిపారు. అలాంటి వారిపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. సరికదా, అధికార పార్టీ నేతలు దాన్ని గొప్పగా చెప్పుకుంటూ మాట్లాడిన వ్యక్తులు హీరోలుగా అభివర్ణించారు. ప్రతిపక్ష నేతల కుటుంబసభ్యులను సైతం మహిళలని కూడా చూడకుండా జగుప్సాకరంగా మాట్లాడారు. దీనిపై కొందరు ప్రైవేటు కేసులు కూడా వేసివున్నారు. ఏపీ పోలీసుల తీరును స్వయంగా సీబీఐనే సుప్రీంకోర్టులో కుమ్ముక్కు అయ్యారు అని పేర్కొనింది అంటే ప్రభుత్వ పోలీసింగ్ గా ఎంతమేర మారిందో ఇట్టే తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Nara Lokesh: జగన్ ఓ పిల్లి నా కొడుకు.. నారా లోకేష్