Site icon Prime9

Nara Lokesh : వాలంటీర్ పై అత్యాచారాయత్నం..నిందితుడికి అండగా వైకాపా ఎమ్మెల్యే.. స్పందించిన నారా లోకేష్

nara lokesh post about rape and murder attempt on volunteer at ap

nara lokesh post about rape and murder attempt on volunteer at ap

Nara Lokesh : దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా నిత్యయం మహిళలపై జరిగే దాడుల గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. ప్రభుత్వాలు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికి ఈ నేరాలు మాత్రం ఆగడం లేదు. ఇక మన తెలుగు రాష్ట్రాలలో సైతం ఈ ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. ఇక ఏపీలో మహిళలకు రక్షణ కరవైంది అంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్న క్రమంలో తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇక ఈ ఘటనపై తెదేపా నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. వైకాపా సర్కారులో ఆయన సొంతపార్టీ కార్యకర్తలకే రక్షణ లేకుండా పోయిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు తమ కార్యకర్తలపైనా దాష్టీకం చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. సొంత పార్టీ కార్యకర్తలనే వదలని వాళ్లు సామాన్యుల విషయంలో ఎలా వ్యవహరిస్తారో ఆలోచించనక్కర్లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే బాధిత యువతి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. బాధితురాలి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టిన (Nara Lokesh) లోకేష్.. వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మడకశిర నియోజకవర్గం రావూరు పంచాయతీ పరిధిలో వేద అనే యువతి వాలంటీర్ గా పని చేస్తుంది. తనపై వైసీపీ ఎంపీటీసీ అత్యాచార యత్నం చేశారని..  నిందితుడికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని, ఆయనే వెనకుండి ఇదంతా చేయిస్తున్నాడని బాధితురాలు వాపోతుంది. వారి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందన్నా పోలీసులు స్పందించడంలేదని వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది.  వైసీపీ ఎంపీటీసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది.

 

Exit mobile version