Nagababu: వైసీపీ పాలనలో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. యలమంచిలో జనసేన పార్టీ నూతన కార్యాలయంను ఆయన ప్రారంభించారు. అనంతరం జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నాగబాబు మండిపడ్డారు.
వైసీపీపై నాగబాబు ఫైర్..
వైసీపీ పాలనలో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. యలమంచిలో జనసేన పార్టీ నూతన కార్యాలయంను ఆయన ప్రారంభించారు. అనంతరం జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నాగబాబు మండిపడ్డారు.
వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ జనసేననే అని నాగబాబు అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అక్రమాలు, అవినీతి భారీగా పెరిగిపోయాయని మండిపడ్డారు.
జగన్ పాలనలో చేసిన స్కామ్ లు.. గంజాయి అమ్మకాలు వంటివి లెక్కలేనివి ఉన్నాయన్నారు. మహాభారతానికి మంచి ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.
ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే అవినీతి చేసినవారేనని.. అందులో ఐదుగురు కూడా మంచి పనులు చేసిన వారు లేరని నాగబాబు అన్నారు.
మరో ఐదేళ్లు జగన్ పాలన వస్తే.. రాష్ట్రంలో బతికే పరిస్థితులు ఉండవని నాగబాబు తెలిపారు.
జనసేన ప్రభుత్వం వస్తే.. ఏం చేస్తుందని చాలా మంది అంటుంటారు. జనసేన గనక అధికారంలోకి వస్తే.. సంక్షేమ పథకాలతో పాటు.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని అన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నాగబాబు అన్నారు. అధికారంలో లేకున్నా.. ప్రజా సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ పాటుపడుతున్నారని వివరించారు.
జనసేన అధికారంలోకి రాగానే.. మహిళ సాధికారితకు పెద్దపీట వేస్తామని అన్నారు. మహిళల పట్ల వేధింపులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు తీసుకొస్తామని అన్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా నాగబాబు అన్నారు.