Site icon Prime9

Nagababu: చంద్రబాబును బూచిగా చూపించి పవన్‌ను ఆపేస్తారా? జగన్.. ఎందుకంత భయపడుతున్నావ్?- నాగబాబు

nagababu comments on cm jagan about chandrababu programs

nagababu comments on cm jagan about chandrababu programs

Nagababu: తెలుగు దేశం పార్టీ కార్యక్రమాల్లో తరచుగా జరుగుతున్న అపశృతులని బూచిగా చూపి జగన్ ప్రభుత్వం జనసేన యాత్రలని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మెగా బ్రదర్ నాగబాబు దుయ్యబట్టారు. తెలుగు దేశం పార్టీ కార్యక్రమాల్లో వరుసగా జరిగిన వేరు వేరు దుర్ఘటనల్లో 11 మంది మృతి చెందారు. నెల్లూరు జిల్లాలోని కందుకూరు గ్రామంలో నిర్వహించిన ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అనే నినాదంతో తెలుగుదేశం నిర్వహించిన సభలో ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిపోయి 8 మంది ప్రాణాలు పోగొట్టుకోగా మొన్న నూతన సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమం లో తొక్కిసలాట జరిగి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.

కాగా తాజాగా వైసీపీ ప్రభుత్వం జరిగిన ప్రమాదాలకు చర్యలు తీసుకునే ప్రక్రియలో భాగంగా మొత్తానికి రోడ్ షోలని నిషేధిస్తూ జీవో జారీ చెయ్యడం జరిగింది. దీనిపై స్పందించిన జనసేన నాయకులు, మెగా బ్రదర్ కొణిదెల నాగ బాబు ప్రభుత్వ నిర్ణయాన్ని దుయ్యబట్టారు. రోడ్లపై సభలు పెట్టకూడదు అని జీవో జారీ చెయ్యడంలో వైసీపీ భయం ప్రస్ఫుటంగా తెలుస్తుందని విమర్శించారు. మన దేశం లో అనేక మంది తమ మత ఆచారాలు పాటిస్తూ ఊరేగింపులు, ఉత్సవాలు జరుపుకుంటారని అవి కూడా పర్మిషన్లు తీసుకుని రూల్స్ ప్రకారమే చేసుకుంటారని ఆయన తెలిపారు. దీనికి రూల్ మార్చాల్సిన పని లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు చంద్రబాబు సభల్లో కొంతమంది చనిపోవడం బాధాకరమని.. వీటిలో కుట్ర కోణం ఉందనే అనుమానం కూడా ఉందని ఆయన అన్నారు. ప్రజల దగ్గరకి వెళ్లి రోడ్ షోస్ చెయ్యడం వాళ్ళ యొక్క ప్రచారాలు చేసుకోవడం రాజకీయ నాయకుల హక్కని ఆయన తెలిపారు.

మీరు పాదయాత్ర చేసినప్పుడు ఇలాంటి రూల్స్ పెట్టి ఉంటే మీరు పాదయాత్ర చెయ్యగలిగే వారా ? అని నాగబాబు ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా మీకు పాదయాత్ర చేసుకునే అవకాశం ఇస్తే.. మీరు మాత్రం ఇలా నిరంకుశత్వంగా పాలన చెయ్యడం సరికాదని ఆయన సీఎం జగన్ పై మండిపడ్డారు. మీ జీవో కోర్టులో నిలబడదంటూ చెప్పారు. పవన్ కళ్యాణ్ ని లేదా చంద్రబాబునో మీరు ఎలా ఆపుతారు ?.. ఆపితే ప్రత్యామ్న్యాయ మార్గాలు సోషల్ మీడియా ఉంది. మేము కోర్టులో పోరాడతాం.. మీరు జీవో వెనక్కి తీసుకోవాల్సిందే అని నాగ బాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Exit mobile version