MLA Dwarampudi Chandrashekar Reddy : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం చేయమని.. కోరడం.. వైసీపీ ఎమ్మెల్యే లపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడడం.. సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను అన్నయ్య, తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని సెటైర్ వేశారు. కాకినాడలో కాంగ్రెస్ జెండాలు పాతి పాతి ఈ స్థాయికి వచ్చానని.. తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. తాను కాకినాడ లోకల్ అని.. ఏ విషయంలో కూడా తగ్గేది లేదని అన్నారు. కాగా ఇప్పుడు ద్వారంపూడి పై జనసేన నేతలు తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు.
MLA Dwarampudi Chandrashekar Reddy : దమ్ముంటే నాపై పోటీ చెయ్ అంటూ జనసేనానికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే ద్వారంపూడి

MLA Dwarampudi Chandrashekar Reddy comments on pawan kalyan