Site icon Prime9

Janasena Party : మెగాబ్రదర్ నాగబాబుకు జనసేన పార్టీలో పదోన్నతి.. ఇకపై ఆ బాధ్యతలు కూడా

mega brother naga babu apponted as janasena party genaral secretary

mega brother naga babu apponted as janasena party genaral secretary

Janasena Party : పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదుగుతుంది. గతంతో పోలిస్తే పవన్ శైలిలో కూడా పూర్తిగా మార్పు కనిపిస్తుంది. దూకుడుగా “మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ” ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ 2024 ఎన్నికలే టార్గెట్ గా దూసుకుపోతున్నారు. కాగా ఈ క్రమంలోనే పార్టీని క్షేత్ర స్థాయి నుంచే బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. కాగా ఈ మేరకు పార్టీ కోసం పాటు పడుతున్న నేతలకు మరింత బలోపేతం చేసేలా కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు  మెగా బ్రదర్ నాగబాబుకు జనసేన పార్టీలో పదోన్నతి లభించింది.

పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రభుత్వంపై విమస్యలు గుప్పించేందుకు ఎప్పుడు తన తమ్ముడికి అండగా ఉంటారు నాగబాబు. అలానే నాగబాబు ఇప్పటి వరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అయితే తాజాగా నాగబాబును జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పవన్ ఆదేశాలు జారీ చేశారు. జనసేన పార్టీ ఎన్నారై విభాగం కార్యకలాపాలను కూడా నాగబాబు పర్యవేక్షించనున్నారు. ఇతర దేశాల్లోని జనసేన శ్రేణులను సమన్వయపరచడం, ఎన్నారైల సేవలను పార్టీ కోసం వినియోగంచుకోవడం వంటి బాధ్యతలను కూడా నాగబాబుకు అప్పగించారు.

అదే విధంగా నెల్లూరుకు చెందిన వేములపాటి అజయ్ కుమార్ జనసేన కోసం చురుగ్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు జనసేన పార్టీ అధికార ప్రతినిధి (జాతీయ మీడియా) పదవి వరించింది. అంతేకాదు, జనసేన పార్టీ కోసం రాజకీయ శిక్షణ తరగతులు, జనసేన పార్టీ అంతర్గత క్రమశిక్షణ వ్యవహారాల పర్యవేక్షణ, బూత్ స్థాయి పర్యవేక్షణ బాధ్యతలను కూడా అజయ్ కి అప్పగించారు. ఈ నియామకాలపై పవన్ కల్యాణ్ స్పందించారు. నాగబాబు, అజయ్ కుమార్ పార్టీ అభ్యున్నతి దిశగా మెరుగైన సేవలు అందిస్తారని భావిస్తున్నామని తెలిపారు. వారిద్దరికీ అభినందనలు తెలియజేశారు. కాగా ఈ మేరకు జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా వారికి బాధ్యతలు అప్పగిస్తూ పవన్ కళ్యాణ్ అభినందించిన ఫోటోలతో పాటు, ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు.

ఆ ప్రెస్ నోట్ లో (Janasena Party)..

కొణిదెల నాగబాబుని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. నాగబాబు ప్రస్తుతం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యునిగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఆయన సేవలు మరింత విస్తృతంగా పార్టీకి ఉపయోగపడే విధంగా కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. దీంతో పాటు విదేశాలలో ఉన్న పార్టీ ప్రతినిధులు, అభిమానులను నాగబాబు సమన్వయపరుస్తారు. ఎన్.ఆర్.ఐ.ల సేవలను పార్టీకి సమర్ధవంతంగా ఉపయోగపడే విధంగా నాగబాబు సేవలు అందిస్తారు పేర్కొన్నారు.

అదే విధంగా నెల్లూరుకు చెందిన ఉన్నత విద్యావంతుడు, గత కొన్నేళ్లుగా జనసేన పార్టీకి పరోక్షంగా సేవలందిస్తున్న వేములపాటి అజయ్ కుమార్ కి పార్టీకి సంబంధించి కొన్ని ముఖ్య వ్యవహారాల బాధ్యతలను పవన్ కళ్యాణ్ అప్పగించారు. జాతీయ మీడియాకు పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా సేవలు అందించడంతో పాటు రాజకీయ శిక్షణ తరగతులు, బూత్ స్థాయి పర్యవేక్షణ, పార్టీ అంతర్గత క్రమశిక్షణ (కాన్సిక్ట్ మేనేజ్మెంట్) నిర్వహణ బాధ్యతలను అజయ్ కుమార్ నిర్వహించనున్నారు. డిగ్రీ వరకు నెల్లూరులో చదివిన అజయ్ ఉస్మానియా విశ్వ విద్యాలయంలో పి.జి. పూర్తి చేశారు. విద్యార్ధి నాయకునిగా ఓయూలో చురుకైన పాత్ర పోషించారు. రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చిన అజయ్ వివిధ రంగాలలో మంచి ప్రవేశం వుండడంతోపాటు మానవ వనరుల అభివృద్ధిలో అపార నైపుణ్యం కలిగి వున్నారు. వీరివురు పార్టీకి మేలైన సేవలు అందిస్తారన్న గట్టి నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు అంటూ అభినందనలు తెలియచేశారు.

 

 

 

Exit mobile version