Site icon Prime9

Janasena Varahi Yatra : జన సముద్రంలా జనసేనాని పవన్ కళ్యాణ్ ర్యాలీ.. మరికొద్దిసేపట్లో ముదినేపల్లి సభా వేదికకు.. లైవ్

live from Janasena Varahi Yatra fourth phase at mudinepalli

live from Janasena Varahi Yatra fourth phase at mudinepalli

Janasena Varahi Yatra : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. నాలుగో దశ వారాహి యాత్రలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేడు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లిలో జనసేనాని ఇవాళ పర్యటించనున్నారు. ఈ మేరకు ముదినేపల్లిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. యాత్రలో చివరి రోజు కావడంతో.. జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక కొత్తపల్లి నుంచి ముదినేపల్లి వరకూ ప్రధాన రహదారిపై జనసేనాని కోసం.. ఘన స్వాగతం పలుకుతూ భారీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇక చివరి రోజు సేనాని ఇచ్చే ప్రసంగంపై అటు జనసేన, తెదేపా కార్యకర్తల్లోనూ.. అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఆయన చివరి రోజు ప్రభుత్వంపై ఏం ప్రశ్నలు సంధిస్తారోనని స్థానిక వైసీపీ నాయకులు, వైసీపీ అధిష్టానం ఉత్కంఠగా ఎదరుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే మచిలీపట్నం నుంచి భారీ ర్యాలీతో వస్తున్న పవన్ కు జనం నీరాజనాలు పడుతూ స్వాగతం పలుకుతున్నారు. దీంతో వాహనాలు, ప్రజలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయి జానా సముద్రాన్ని తలపిస్తున్నాయి. అదే విధంగా సభా వేదిక వద్ద కూడా మరికొద్ది సేపట్లో పవన్ రానుండడంతో భారీ స్థాయిలో ప్రజలు అక్కడికి చేరుకొని ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పెద్దల నుంచి యువకులు, యువతులు సేనాని కోసం నినాదాలు చేస్తూ మా భవిష్యత్తుకు మీరే మార్గదర్శి అంటూ బై బై వైసీపీ అని కేకలు వేయడం గమనించవచ్చు. ఇక అక్కడి నుంచి మీకోసం ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారం..

 

 

Exit mobile version