Site icon Prime9

Lakshmi Parvathi: జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా టీడీపీ లేవలేదు.. ఐదేళ్లు ప్రజల్లో తిరగాల్సిందే – లక్ష్మీపార్వతి

Lakshmi Parvathi

Lakshmi Parvathi

lakshmi Parvathi: తెలుగు దేశం పార్టీ పై వైఎస్సీర్సీపీ నేత లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఉపయోగం లేదన్నారు.

ఇప్పటికే చాలా ఆలస్యంమైందని వ్యాఖ్యానించారు. ఒక వేళ టీడీపీ పూర్తి పగ్గాలు తీసుకుని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లాగా ఐదేళ్లు జనంతో మమైకమైతే ఎన్టీఆర్ కు అవకాశం ఉండోచ్చన్నారు.

ఇప్పుడు తారక్ వచ్చినా టీడీపీ లేవలేదని ..ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుతూ ఉంటే అపుడు ఆలోచించవచ్చని ఆమె అన్నారు.

 

పాదయాత్ర క్వాలిటీ లోకేష్ లో లేదు (lakshmi Parvathi)

మరోవైపు నారా లోకేష్ యువ గళం పాదయాత్ర పైనా లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర నవ్వులాట లా ఉందని ఎద్దేవా చేశారు.

లోకేష్ లో పాదయాత్ర చేసే క్వాలిటీలు లేవని ఆరోపించారు. రాజకీయాలకు లోకేష్ పనికిరాడని.. కనీసం మాట్లాడటం చేతకాని వాడ.. ప్రజల్ని ఎలా పాలిస్తాడని ఆమె ప్రశ్నించారు.

ఎంత మంది కలిసి వచ్చినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేసి విజయ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజాకర్షణ లేని వారే చంద్రబాబులా పొత్తులు పెట్టుకుంటారన్నారు.

 

సీబీఐలో చంద్రబాబు మనుషులు (lakshmi Parvathi)

చంద్రబాబు హయంలోనే వైఎస్ వివేకానంద రెడ్డ హత్య జరిగిందని .. పోలీసులంతా ఆయన చేతుల్లోనే ఉన్నారన్నారు.

హత్య జరిగినపుడే చంద్రబాబు సీబీఐ కి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో విచారణ చేస్తున్న సీబీఐ అధికారుల్లో చంద్రబాబు మనుషులు ఉన్నారని ఆరోపించారు.

రాజకీయంగా ఇరికించే ప్రయత్నం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అని తెలిపారు.

వైసీపీ లో అసమ్మతి సెగలపై లక్ష్మీపార్వతి స్పందిస్తూ ఎన్నికల ముందు ఇలాంటివి సహజమన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ తో సంబంధాలు పెట్టుకున్నారని విమర్శించారు.

రాజధాని రైతుల పేరుతో టీడీపీ పాదయాత్రకు కోటం రెడ్డి సాయం చేశారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డికి.. కోటం రెడ్డి ద్రోహం చేశారన్నారు.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version