Janasena Pawan Kalyan : వైకాపా ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలను చూస్తే ఎందుకంత అభద్రతాభావం అంటూ జగన్ సర్కార్ ని ప్రశ్నించారు. శుక్రవారం నాడు తెదేపా అధినేత చంద్రబాబు పై దాడిని ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో.. చంద్రబాబు కార్యక్రమంపై రాళ్ళ దాడికి పాల్పడటాన్ని పవన్ ఖండించారు. ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలను చూసి అధికారంలో ఉన్న వైసీపీ ఎందుకింత అభద్రతకు లోనవుతుందో అర్థం కావడం లేదన్నారు పవన్.
పవన్ కల్యాణ్. అధికార పక్షం బాధ్యత విస్మరించిన చోట కచ్చితంగా ప్రతిపక్షం ప్రజల కోసం నిలబడుతుందని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానిది కీలక భూమిక అన్న పవన్.. ప్రతిపక్ష పార్టీలను నిలువరించాలని చూస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బ తింటుందని హెచ్చరించారు. అధికార పక్షం బాధ్యత విస్మరించిన చోట కచ్చితంగా ప్రతిపక్షం ప్రజల కోసం నిలబడుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానిది కీలక భూమిక అని.. ప్రతిపక్ష పార్టీలను నిలువరించాలని చూస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బ తింటుందని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా యరగొండపాలెంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమంపై రాళ్ళ దాడికి పాల్పడటాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. ఆయన భద్రత సిబ్బందికి గాయాలు అయ్యాయని తెలిసింది. ప్రతిపక్ష నాయకుల పర్యటనలకు తగిన భద్రత కల్పించడంపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
నేను విశాఖలో జనవాణి కార్యక్రమానికి వెళ్లినప్పుడు పాలకులు వ్యవస్థలను వాడుకొని ఏ విధంగా ప్రవర్తించారో అంతా చూశారు. పాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి దాడులకు పాల్పడి, ఆటంకాలు కల్పించడం ద్వారా తాము ఏం కోల్పోబోతున్నారో ముందుగానే వెల్లడిస్తున్నట్లు ఉందని పవన్ అన్నారు. అయితే శుక్రవారం రోజు చంద్రబాబు నాయుడి పర్యటన యర్రగొండపాలేనికి చేరుకోగానే సుమారు 200 మంది వైకాపా నేతలు రోడ్డు పై నిలబడి బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నల్ల జెండాలు, బెలూన్లు ప్రదర్శించారు. ఈ సమయంలో ఒక్క సారిగా ఆయన వాహనంపై రాళ్ల దాడి జరిగింది. దీంతో ఎన్ఎస్జీ కమాండెంట్ సంతోష్ కుమార్ తలకు గాయాలయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతవరణం నెలకొంది.
ప్రతిపక్ష పార్టీలను చూస్తే ఎందుకింత అభద్రతా భావం? – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/c2Kox0w85S
— JanaSena Party (@JanaSenaParty) April 21, 2023
చంద్రబాబు నాయుడికి గాయాలు కాకుండా భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుపెట్టారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన చంద్రబాబు నాయుడు మంత్రి ఆదిమూలపు సురేష్ ఆఫీసు ఎదుట తన వాహనాన్ని నిలిపారు. తన జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఈ సమయంలో అక్కడి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో మళ్లీ వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి