Site icon Prime9

Pawan Kalyan : జనసేనాని పవన్ వ్యక్తిగత జీవితంపై తప్పుడు వార్తలు రాసిన వారికి దిమ్మతిరిగే షాక్..

janasena party serious action against fake news on Pawan Kalyan

janasena party serious action against fake news on Pawan Kalyan

Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్.. ఆయన సతీమణి అన్నా లెజ్నెవా విడిపోయారంటూ ఇటీవల తప్పుడు వార్తలు ఎక్కువగా ప్రచారం అయిన విషయం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. అలానే పవన్ వ్యక్తిగత జీవితంపై తప్పుడు కథనాలు, అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కూడా  వెల్లడించింది. ఈ మేరకు తాజాగా పవన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలతో పాటు, వారి అనుబంధ యూట్యూబ్ చానల్స్, పలు మీడియా సంస్థలపై చర్యలు తీసుకోనున్నామని తెలిపింది. ఈ మేరకు వైసీపీకి చెందిన కొన్ని అసభ్యకర ఖాతాల వివరాలు అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ జాబితాను రిలీజ్ చేసింది. అందులో పలు మీడియా సంస్థలు కూడా ఉండడం గమనార్హం.

 

Exit mobile version