Site icon Prime9

Pawan Kalyan Bus Yatra: జనసేనాని యాత్రకు సిద్దమవుతున్న బస్సు

Janasena-Yatra-bus

Hyderabad: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయదశమి నుంచి బస్సు యాత్రకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. దీని కోసం ప్రత్యేకంగా బస్సు తయారు చేస్తున్నారు. హైదరాబాద్‌లో తయారవుతున్న ఈ బస్సుకు రెగ్యులర్ బస్‌లు, లారీలకు వాడే పెద్ద టైర్లు ఉపయోగించారు.

వర్క్ షాపులో తయారు అవుతున్న ఈ బస్సు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బస్సుఈ నెల 26 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని చెబుతున్నారు. బస్సులో స్పెషల్‌గా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. పవన్ బస్సులో ఉంటే ఎంత దూరంలో ఉన్న వారికి అయినా కనిపించేలా బస్ టాప్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు.

యాత్ర జరిగినన్ని రోజులు పవన్ ఈ బస్సులోనే ఉండనున్నారు. ఆయన అలవాట్లు, అవసరాలకు తగ్గట్లుగా బస్సులో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.. ఈ నెల 18న సమావేశంకానున్న జనసేన పార్టీ నేతలు ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే యాత్ర ఎన్ని విడతలుగా జరగాలి, ఏఏ మార్గాల్లో ఎన్ని రోజుల యాత్ర జరగాలి? అనే దానిపై కసరత్తు జరుగుతోంది.

Exit mobile version