Site icon Prime9

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బర్త్ డే కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన నెల్లూరు జనసేన నేత.. 470 కేజీల వెండితో చిత్రపటం

janasena leader special gift of pawan kalyan replica with 470 kgs silver

janasena leader special gift of pawan kalyan replica with 470 kgs silver

Pawan Kalyan : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని 470 కేజీల వెండితో చిత్ర రూపం తీర్చిదిద్ది మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చారు. నెల్లూరు నగర పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో ఈ కళాకృతిని తయారు చేయించారని తెలుస్తుంది. కాగా ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తాజాగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, పార్టీ నేతలు కొట్టే వెంకటేశ్వర్లు, సుందర రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version