Site icon Prime9

Janasena Party : పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో తాడేపల్లిగూడెం సభ కోసం భారీగా కదిలివస్తున్న జనసైనికులు..

janasena chief pawan kalyan today meeting details

janasena chief pawan kalyan today meeting details

Janasena Party : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో దశ వారాహి యాత్ర భారీ జనసందోహం మధ్య దిగ్విజయంగా సాగుతుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుండగా.. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఈ క్రమంలో నేడు తాజాగా పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలను సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ (Janasena Party) ప్రకటించింది. ఇందులో భాగంగా నేడు పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం లో పర్యటించనున్నారు. అలానే సాయంత్రం 5 గంటలకు స్థానిక ఎస్.వి.ఆర్ సర్కిల్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.

 

 

వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను నియంత్రించేందుకే వాలంటీర్ వ్యవస్థ అని ఆయన ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థ సేకరించిన డేటా ఎక్కడికో వెళ్లిపోతోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలకు సేవలు అందించేందుకు ఇన్ని వ్యవస్థలున్నప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఏం చేయాలని ప్రశ్నించారు. తాను చెప్పేది అందరు వాలంటీర్ల గురించి కాదని అన్నారు.

అవసరానికి మించి డేటా ఇవ్వకండి..(Janasena chief Pawan Kalyan)

వాలంటీర్ వ్యవస్థతో జాగ్రత్తగా ఉండాలి. వాలంటీర్లకు అవసరానికి మించి మీ డేటా ఇవ్వకండి. వాలంటీర్ వ్యవస్థ చాలా ప్రమాదకరంగా తయారవుతోందని పవన్ కళ్యాణ్ అన్నారు. వాలంటీర్లకు రూ.5000 ఇచ్చి ఇంట్లో దూరే అవకాశం ఇచ్చారు.మీ సమాచారం అంతా వాళ్ళకి తెలుసు.ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అంతా తెలుస్తోంది.మరి ఈ సమాచారం వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంటే ఎలా అని ప్రశ్నించారు.ప్రభుత్వం ఉద్దేశం వేరే అవ్వచ్చు.సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తే ఎలా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

Exit mobile version