Site icon Prime9

Janasena Chief Pawan Kalyan : మొదటిసారి “నన్ను సీఎం చేయండి” అని అడిగిన జనసేనాని.. ఇక కురుక్షేత్రమే !

janasena chief pawan kalyan speech highlights in pithapuram

janasena chief pawan kalyan speech highlights in pithapuram

Janasena Chief Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ‘పిఠాపురం సాక్షిగా.. దత్తాత్రేయుడి సాక్షిగా అడుగుతున్నా.. నాకు అధికారం ఇవ్వండి. మిమ్మల్ని అర్థిస్తున్నా.. నన్ను సీఎంను చేయండి’ అని వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా నిన్న రాత్రి పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంతకీ ఏమన్నారంటే.. 

“వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి స్థానం నాకు ఇవ్వగలిగితే శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన నేల సాక్షిగా చెబుతున్నాను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని పవన్ కళ్యాణ్ అన్నారు. దశాబ్దం తర్వాత అన్ని అంశాల మీద పూర్తి అధ్యయనం చేసి, సంపూర్ణ – అవగాహనతో ఈ మాట చెబుతున్నాను అన్నారు. దత్తాత్రేయ అంశలోని శ్రీపాద వల్లభుడు క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురం నుంచి అర్ధిస్తున్నాను అన్నారు. రాష్ట్ర బాధ్యత తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి స్థానం ఇవ్వగలిగితే ఏపీని దేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని పవన్ అంటున్నారు. దశాబ్దం తర్వాత అన్ని అంశాలపై పూర్తి అధ్యయనం చేసి, సంపూర్ణ అవగాహనతో ఈ మాట చెబుతున్నాను అని వ్యాఖ్యలు చేస్తున్నారు.

మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వను అంటూ బల్లగుద్ది చెప్పిన.. ఏ సభ పెట్టినా.. ఎక్కడ ప్రెస్‌మీట్‌ పెట్టినా.. ఏ వేదికపై మాట్లాడినా ఇదే విషయాన్ని పదే పదే చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు మొదటిసారి అధికారం ఇవ్వమని.. తనను సీఎం చేయమని కోరడం పెను సంచలనంగా మారింది. ఇన్నాళ్ళూ చంద్రబాబుకు పవన్ కల్యాణ్ దత్తపుత్రుడని.. అంటూ కామెంట్లు చేసిన వారు సైతం పవన్ స్పీచ్ తో ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

అలానే కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో ఎంత గొడవలు జరిగితే వైసీపీ అంత లాభపడుతుందనేది వైసీపీ నాయకుడి గేమ్ ప్లాన్. పిఠాపురం రాగానే నాకు రాష్ట్రంలో జరిగిన హిందూ ఆలయాల మీద దాడులు గుర్తుకొచ్చాయి. ఆధ్యాత్మిక క్షేత్రం పిఠాపురం నుంచే ఈ దాడులు మొదలయ్యాయి. 219 హిందూ ఆలయాల మీద దాడులు, విగ్రహాల ధ్వంసం సంఘటనలు జరిగితే ఒక్కరిని కూడా వైసీపీ ప్రభుత్వం పట్టుకోలేదు. దీని వెనుక చచ్చు ముఖ్యమంత్రి ఆలోచన దాగుంది. వైసీపీ నాయకుల కుట్ర దాగుంది. వరుసగా హిందూ ఆలయాల మీద దాడులు జరిగితే సనాతన ధర్మం నమ్మే హిందువులంతా వేరే మతస్థులను అనుమానించాలి. దాని ద్వారా వారితో గొడవ పడాలి. సమాజంలో ఘర్షణలు చెలరేగితే వైసీపీ దాని నుంచి బోలెడు లాభం పొందాలనే చచ్చు ప్రభుత్వం ఆలోచనలతోనే వరుసగా ఆలయాల మీద దాడులు జరిగాయి. సమాజంలో ఎన్ని గొడవలు జరిగితే వైసీపీ నాయకులకు అంత ఇష్టం. యువకులు తమ భవిష్యత్తును వదిలేసి పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే ఈ నాయకులు అంత ఆనందపడతారు. పిఠాపురంలో మొదట హిందూ దేవతల విగ్రహం ధ్వంసం చేస్తే నిందితుడిని పిచ్చివాడు అని చెప్పారు.

Exit mobile version