Mangalagiri: నా కన్నతల్లిని, చిన్నారులను తిట్టడం ఏంటిరా మీ సంస్కరహీనానికి హద్దులేదా అంటూ వైసిపిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిట్టిపోశారు. తనకు భాష రాదనుకొంటే పొరపాటన్నారు. మంగళగిరి సభలో వైకాపా నేతల తీరును ఆయన ఎండగట్టారు. తానేమి లండన్, నూయార్క్ లో పెరగలేదన్నారు. నేను పుట్టింది బాపట్లగా పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. గొడ్డుకారం తిన్నవాడ్ని, చీరాల, ఒంగోలు ప్రాంతాలు నాకు సుపరిచయం అన్నారు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవలని వైకాపా వర్గీయులకు హితవు పలికారు.
తన విడాకుల పై కూడా పవన్ స్పందించారు. చట్టపరంగా వారికి విడాకులు ఇచ్చిన తర్వాతే పెండ్లి చేసుకొన్నారన్నారు. మీలాగా 20మందిని ఉంచుకొనే తత్వం కాదని హెచ్చరించారు. మీకు మంచి, మర్యాదలు నచ్చవన్నారు. శిక్షా ధర్మంతోనే జవాబు చెప్పాలని నిర్ణయించుకొన్నాని అన్నారు.
వైసిపి పార్టీలో మంచివారు కూడా ఉన్నారన్నారు. బాలినేని, ఆనం లాంటి వ్యక్తులు అందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు. బూతులు మాట్లాడే వారికి నేను మాట్లాడింది చెల్లుతుందన్నారు. పద్ధతి, మర్యాదకు కట్టుబడివున్నానన్నారు. బలవంతమైన సిద్ధాంతం నాదన్నారు. రాడ్లా, హాకీ స్టిక్కులా, తీసుకొని రండి అంటూ వైకాపా ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి:Pawan Kalyan: వైసిపి నేతలకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. దవడ వాచిపోయేలా కొడతా.. దేంతోనంటే?