Site icon Prime9

Nara Lokesh: నోటితో బూతుల వాంతులు చేసుకునే కొడాలి నానికి గౌరవమర్యాదలా.. నారా లోకేష్

Nara Lokesh

Nara Lokesh

Andhra Pradesh: తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత మహిళా నేతలను అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి నారా లోకేష్ ఖండించారు. నిత్యం నోటికొచ్చినట్లు మాట్లాడే కొడాలి నానిని ఎన్నిస్లారు అరెస్ట్ చేయాలని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దళితుల పై దమనకాండ సాగిస్తూ, ఎస్సీ సంక్షేమ పథకాలు రద్దు చేసిన ప్రభుత్వం తీరు పై శాంతియుతంగా నిరసన తెలిపిన టీడీపీ దళిత మహిళా నేతలు నిర్మల, సునీతారాణిల అరెస్ట్ జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనకి పరాకాష్ట. సీఎం జగన్‌రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లిందని పోలీసులు కేసు నమోదు చేయడం హాస్యాస్పదం అని లోకేష్ అన్నారు.

నోటితో బూతుల వాంతులు చేసుకునే కేసినో కేటు కొడాలి నానికి గౌరవ మర్యాదలు ఎక్కడున్నాయి భంగం కలగడానికి. ఇదే చట్టం అందరికీ అమలైతే, నాటి సీఎం చంద్రబాబు గారిని నడిరోడ్డు పై నరికేయాలన్న ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి గారి పై ఎన్ని కేసులు పెట్టాలి. నిత్యమూ రోతకూతలు, బూతులతో ఉచ్ఛనీచాలు మరిచి ప్రతిపక్షనేతలు, ప్రజాసంఘాల నేతలను దూషించే కొడాలి నానీని ఎన్నిసార్లు అరెస్టు చేయాలి. అక్రమంగా అరెస్టు చేసిన టిడిపి దళిత మహిళానేతలను తక్షణమే విడుదల చేయాలి. అక్రమ కేసులు ఎదుర్కొంటున్న మహిళానేతలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని నారా లోకేష్ ట్వీట్లు చేసారు.

Exit mobile version