Kurnool: కర్నూలులో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. ఉదయం రాజ్ విహార్ సర్కిల్ సమీపంలోని మౌర్య ఇన్ హోటల్ లో జరిగిన చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని న్యాయవాదులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో అక్కడ ఉన్న టిడిపి కార్యకర్తలకు, న్యాయవాదులకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి న్యాయవాదులను అక్కడిని నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం చంద్రబాబు టిడిపి కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వస్తున్న సమయంలో మరో సారి న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు అడ్డుకోనే ప్రయత్నం చేశారు.
తరువాత నగర శివార్లలో టిడ్కో గృహాలను పరిశీలించేందుకు వెళ్తుతుండగా అక్కడ కూడా విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకోని చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కర్నూలు నగరంలో జరిగిన చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకోవడంతో సహనం కోల్పోయిన చంద్రబాబు వైసిపి నాయకులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అల్లర్లు సృష్టించి అడ్డుకోవాలని చూస్తే తాట తీస్తానంటూ మండిపడ్డారు. అవసరం అయితే కర్నూలులోనే ఉంటా, రాయలసీమకు ఎవరేమి చేశారో చర్చించడానికి నేను సిద్ధం. సీమ అభివృద్ధి పై చర్చించడానికి పేటీఎమ్ బ్యాచ్ సిద్ధమా అని చంద్రబాబు సవాల్ చేశారు.
కులాలు మతాలు ప్రాంతాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ తన పైనే దాడి చేయాలని చూస్తున్నారని, తాను భయపడే ప్రసక్తే లేదని మూడు రాజధానుల పేరుతో వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ నాటకాలు ఆపాలని లేకపోతే తోలు తీస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.