Site icon Prime9

Kuppam: కుప్పంలో టెన్షన్.. టెన్షన్..

Kuppam: తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేడు చంద్రబాబు నాయుడు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చించేశారు. విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. సమాచారం అందుకు చంద్రబాబు నాయుడు హుటాహుటిన అక్కడకు వెళ్లి రోడ్డు పై భైఠాయించారు. దీనితో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఇరు పార్టీల కార్యకర్తలను అదుపు చేస్తున్నారు.

మరోవైపు వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు కూడా సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రతిగా నినాదాలు చేశాయి. ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి.

బుధవారం చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నేడు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అలాగే ఆర్టీసీ బస్సులను సైతం ఎక్కడికక్కడ డిపోల్లోనే నిలిపివేశారు.

Exit mobile version