Ap Skill Development Corporation Scam: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ‘స్కాం’.. 26 మందికి నోటీసులు

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాంపై ఈడీ దృష్టి సారించింది. దీనిలో భాగంగా రూ.234 కోట్ల నిధుల మళ్లింపునకు సంబంధించి కేసు నమోదు చేసింది. ఈ మేరకు విచారణకు హాజరుకావాలంటూ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మాజీ చైర్మన్ గంటా సుబ్బారావులతో పాటు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసింది.

Ap Skill Development Corporation Scam: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాంపై ఈడీ దృష్టి సారించింది. దీనిలో భాగంగా రూ.234 కోట్ల నిధుల మళ్లింపునకు సంబంధించి కేసు నమోదు చేసింది. పలు షెల్ కంపెనీల సాయంతో నిధుల మళ్లింపు జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది. ఈ మేరకు విచారణకు హాజరుకావాలంటూ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మాజీ చైర్మన్ గంటా సుబ్బారావులతో పాటు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసింది. సోమవారం హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో వీరంతా హాజరుకావాలని నోటీసులలో సూచించింది.

స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన కోసం గతంలో చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు దుర్వినియోగం అయ్యాయని జగన్ సర్కార్ భావించింది. ఈ మేరకు దీనిపై విచారణ చేపట్టాలంటూ సీఐడీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మనీలాండరింగ్ కోణం ఉందని భావించిన సీఐడీ ఈడీకు సమాచారం అందించారు. దీనితో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాంపై ఈడీ దృష్టి సారించింది. తాజాగా ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.

ఇదీ చదవండి: దేశభాషలన్నింటిలో శ్రేష్టమైనది తెలుగు- ద్రౌపది ముర్ము