Chiranjeevi Pawan kalyan: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై చిరంజీవి స్పందించారు. ఓ ఇంటర్య్వూలో అడిగిన ప్రశ్నకు చిరంజీవి సమాధానం ఇచ్చారు. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం అది కళ్యాణ్ ఇష్టమని.. దాని గురించి తాను ఎలాంటి కామెంట్ చేయదలచుకోలేదని అన్నారు. పలు సందర్భాల్లో ఏపీ సీఎం జగన్ సైతం పవన్ మూడు పెళ్లిళ్లపై సెటైర్లు వేశారని ప్రశ్నించగా.. రాజకీయంలో విమర్శల గురించి తాను ఏం మాట్లాడదలచుకోలేదని తెలిపారు.
పవన్ కళ్యాణ్ తనకు కుటుంబం పరంగా ఓ బిడ్డలాంటోడని.. రాజకీయంగా అది తన వ్యక్తిగతమని అన్నారు. రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని.. వాటికి పూర్తి దూరంగా ఉన్నానని చిరంజీవి అన్నారు. కాపులను కమ్మ పార్టీకి అమ్ముకుంటున్నారని ప్రశ్నించగా.. ఈ విషయం తాను ఎక్కడా వినలేదని.. అలాంటి వాటికి తాను సమాధానం చెప్పనని ప్రశ్నను దాటవేశారు.
రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్లపై స్పందించిన మెగాస్టార్.. అది తన వ్యక్తిగతమని అన్నారు. ఇలాంటి కామెంట్లను తన ఖండించనని.. అది ఎదుటివారి నైజం పై ఇది ఆధారపడి ఉంటుందని చిరంజీవి అన్నారు.
ఇక చివరగా అన్ స్టాపబుల్ షోకి ఎప్పుడు వెళ్తున్నారని ప్రశ్నించగా.. చిరంజీవి అదిరిపోయే సమాధానం ఇచ్చారు. అది అవతలి వ్యక్తిపై ఆధారపడి ఉంటుందని. అలాంటి కోరిక ఇప్పటివరకు తనకు రాలేదన్నారు. ఒకవేళా అలాంటి అవకాశం వస్తే ఆలోచిస్తానని తెలిపారు.
ఇండస్ట్రీలో విభేదాలు ఉన్నప్పటికి.. తాను అందరితో కలిసిపోతానని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో తనకు అందరూ సమానమేనని.. అందరికి ఒకే రకమైన విలువ ఇస్తామని మెగాస్టార్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
ప్యాకేజీ స్టార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి: శవాలపై పేలాలు ఏరుకోవడం అంటే ఇదే.. ఇందుకే పవన్ కళ్యాణ్ తిట్టేది..
“తునివు” మూవీ రివ్యూ: ఫుల్ యాక్షన్ తో అదరగొట్టిన అజిత్
ఆ విషయంలో ఎన్టీఆర్‌పై ఫుల్‌గా ట్రోలింగ్.. మన వాళ్ళని తక్కువ చేయొద్దంటూ వార్నింగ్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/