Site icon Prime9

Chandrababu Naidu: ఎవ్వరినీ బతకనివ్వరా, పవన్ ఇంటి వద్ద రెక్కీ పై చంద్రబాబు స్పందన

Chandrababu asked if he will not let anyone live

Andhra Pradesh: హైదరాబాదులోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి వద్ద జరిగిన అగంతుకుల రెక్కీపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. జనసేన సుప్రీం ఇంటి వద్ద రెక్కీ చేస్తారా? పవన్ పై దాడులు చేద్దామనుకుంటారా? ఎవరిని బతకనివ్వరా? అందరిని చంపేస్తారా? అంటూ చంద్రబాబు ఘాటుగా స్పందించారు.

గత కొద్ది రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు పవన్ కల్యాణ్ ను అనుసరిస్తున్నారు. కార్లు, బైకులతో వచ్చిన అగంతకులు పవన్ కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. రెచ్చగొట్టేలా యత్నించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వారిని చాటుగా వీడియో తీసిన్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఘటన పై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

కలకలం సృష్టించిన పవన్ ఇంటి వద్ద రెక్కీ పై తెలంగాణ పోలీసులు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కొద్ది రోజులకిందట మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడిన పవన్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో జనసేన పార్టీ 14 స్థానాల్లో పోటీ చేసేందుకు మీరు రెడీనా అంటూ అభిమానులతో అన్నారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్‌ను చంపడానికి భారీ స్కెచ్.. జనసైనికులకు నాదెండ్ల ఆదేశాలు

Exit mobile version