Site icon Prime9

Bharat Jodo Yatra: ఏపీలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

Bharat-Jodo-Yatra-ap

Bharat-Jodo-Yatra-ap

Andhra Pradesh: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్నభారత్ జోడో యాత్ర మంగళవారంనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. నాలుగు రోజుల పాటు ఈ యాత్ర రాష్ట్రంలో కొనసాగనుంది. నాలుగు రోజుల్లో 119 కి.మీ దూరం రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రవేశించగానే కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు రాహుల్ గాంధీ యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు.

కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోనీ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ ఉదయం పాదయాత్ర చైత్రగుడి వద్ద ఏపీలో ప్రవేశించిన భారత్ జోడో యాత్ర ఆలూరు చేరుకుంటుంది. మంగళవారం ఉదయం 6.30 పాదయాత్ర ప్రారంభమై ఆదోని చేరుకుంటుంది. రాత్రి 7.30 గంటలకు మలేకుర్తిలో రాహుల్ గాంధీ బస చేస్తారు. రేపు ఉదయం 10.30 గంటలకు తిరుమలనగర్ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వద్దకు చేరుకుంటారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. 7.30 గంటలకు పాదయాత్ర ఆరెకల్ గ్రామానికి చేరుకుంటుంది. రాహుల్ గాంధీ అక్కడే బస చేస్తారు.అక్టోబరు 20న ఉదయం 6.30కు పాదయాత్ర ప్రారంభమవుతుంది. చెన్నాపురం క్రాస్ మీదుగా ఉదయం 10.30 ధర్మాపురం చేరుకుంటుంది. రాత్రి 7.30 గంటలకు కలిదేవకుంట గ్రామం చేరుకుని అక్కడే బస చేస్తారు.అక్టోబరు 21న ఉదయం 6.30 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. మంత్రాలయం గుడి సర్కిల్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మాధవరం మీదుగా కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఏపీ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించినా అడ్డుకోలేకపోయారు. దీనితో గ్రామస్దాయి నుంచి రాష్ట్ర స్దాయి వరకూ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ, వైసీపీలో చేరారు. దీనితో ఏపీలో కాంగ్రెస్ నామమాత్రంగా మిగిలింది. తాజాగా రాహుల్ గాంధీ జోడో యాత్రతో కాంగ్రెస్ కు కొంతైనా పునర్ వైభవం వస్తుందని నేతలు ఆశిస్తున్నారు.

 

Exit mobile version