Site icon Prime9

Pawan Kalyan : నేడు చంద్రబాబును ములాఖత్ లో కలవనున్న పవన్, బాలయ్య, లోకేష్.. రాజమండ్రి చేరుకున్న జనసేనాని

awan kalyan and balakrishna, lokesh going to meet chandrababu in jail

awan kalyan and balakrishna, lokesh going to meet chandrababu in jail

Pawan Kalyan : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ నేడు (గురువారం) రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వీరు ముగ్గురు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇప్పటికే రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌ వద్దకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్‌కు (Pawan Kalyan) జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. మదురపూడి ఎయిర్‌పోర్ట్ నుండి రోడ్డు మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు బయలుదేరారు. ప్రస్తుతం రాజమండ్రి ఎయిర్‌పోర్టు ఎదురుగా ఉన్నటువంటి బేబీ గార్డెన్స్‌లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్. మరికొద్ది సేపట్లో సెంట్రల్ జైలు వద్దకు చేరుకోనున్నారు. పవన్ కళ్యాణ్‌తో ర్యాలీగా వెళ్ళేందుకు కార్లను అనుమతించని పోలిసులు.. కేవలం ఐదు కార్లతో మాత్రమే రాజమండ్రి జైలు వద్దకు వెళ్లాలని సూచించారు.

ఇదివరకే తొలి దఫా ములాఖత్ లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణిలు కలిశారు. కాగా ఇప్పుడు పవన్, బాలకృష్ణ, లోకేష్ ముగ్గురు కలిసి చంద్రబాబుతో భేటీ కానుండడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు చంద్రబాబుతో ములాఖత్ నేపథ్యంలో.. నందమూరి బాలకృష్ణ ఈరోజు ఉదయం రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి లోకేష్, భువనేశ్వరిలు బస చేస్తున్న చోటుకు చేరుకున్నారు. అక్కడ తన సోదరి, కూతురు బ్రాహ్మణిలతో బాలకృష్ణ సమావేశమయ్యారు. జైలు వద్దకు జనసైనికులు, టీడీపీ అభిమానులు ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు. అలానే టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడుసైతం చంద్రబాబుతో గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ కానున్నట్లు తెలిసింది.

చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున పవన్ (Pawan Kalyan) .. ప్రభుత్వం కుట్ర పూరిత అరెస్టును ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. అదే రోజు ఆయన విజయవాడ రావాల్సి ఉండగా ఆయన విమానానికి అనుమతించవద్దని పోలీసులు ఎయిర్ పోర్టుకు లేఖ రాశారు. దాంతో ఆయన ఫ్లైట్‌లో విజయవాడ రాలేకపోయారు. రోడ్డు మార్గం ద్వారా వస్తూంటే ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఆయనను అదుపులోకి తీసుకుని తామే స్వయంగా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో వదిలి పెట్టారు.

Exit mobile version