Site icon Prime9

AP Government: ఏపీ ప్రభుత్వ “అప్పుల” తిప్పలు.. మరోసారి రూ.1,413 కోట్ల రుణం

ap-government-release-financial-aid- to cyclone-mandous-victims

ap-government-release-financial-aid- to cyclone-mandous-victims

Andhra Pradesh: ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకుని తేలలేకపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాజాగా మరోమారు కొత్త రుణాన్ని సేకరించింది. తాజాగా మంగళవారం నాడు రూ.1,413 కోట్ల అప్పును తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఆర్బీఐ) నేతృత్వంలో జరిగిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వం రెండు విభాగాలుగా రూ.1,413 కోట్ల రుణాన్ని తీసుకుంది. ప్రతి మంగళవారం ఆర్బీఐ ఆధ్వర్యంలో సెక్యూరిటీ బాండ్ల వేలం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రూ.700 కోట్లను ఏడేళ్ల కాల వ్యవధికి 7.75 శాతం వడ్డీతో సేకరించింది. అదే సమయంలో మరో రూ.713 కోట్లను 11 ఏళ్ల కాల వ్యవధికి 7.86 శాతం వడ్డీకి తీసుకుంది.

ఇదే కాక రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం పేరుతో ఏపీ మారిటైం బోర్డు ఏకంగా మరో రూ. 5000 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని సమాచారం. ఆర్ఈసీ లిమిటెడ్ నుంచి ఈ రుణాన్ని తీసుకునేందుకు మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అప్పులు తీసుకుంటేనే కానీ ఉద్యోగులకు మరియు ఇతర అభివృద్ధి పనులకు, పథకాల అమలుకు డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉంది ఏపీ ప్రభుత్వం. దీనికోసం అధిక వడ్డీకి అప్పలు చెయ్యాల్సి వస్తోంది. ఆ అప్పు వడ్డీని తీర్చేందుకు మరో కొత్త అప్పును వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మరి ఈ అప్పులు తీరేదెన్నడో ఆర్థిక పరిస్థితి బాగుపడేదెన్నడోని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఇదీ చదవండి: ఆ మందు అమ్మకం, వినియోగంపై నిషేధం

Exit mobile version