Site icon Prime9

AP CID: చింతకాయల విజయ్ కి ఏపీ సీఐడీ నోటీసులు

Chintakayala Vijay

Chintakayala Vijay

Hyderabad: టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు రావడం కలకలం రేపింది. బంజారాహిల్స్‌లోని విజయ్ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు శనివారం వచ్చారు. హైదరాబాద్ లోని విజయ్ ఇంట్లో అతను లేకపోవడంతో అతని సిబ్బందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 6న విజయ్ తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 41 సీఆర్పీసీ కింద విజయ్‌కి నోటీసులు ఇచ్చారు.

మార్ఫింగ్ వీడియోతో తన గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తున్నారంటూ గోరంట్ల మాధవ్ ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిని పరిగణనలోనికి తీసుకున్న సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. అంతేకాదు పలువురు టీడీపీ నేతలను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ టీడీపీ నేత చింతకాయల విజయ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సెప్టెంబర్ 15న విచారణ జరిపిన న్యాయస్థానం గోరంట్ల కేసులో తదుపరి చర్యలను నిలిపివేయాలంటూ సీఐడీని ఆదేశించింది.

మరోవైపు విజ‌య్ ఇంటికి వెళ్లిన పోలీసులు దురుసుగా వ్య‌వ‌హ‌రించార‌ని టీడీపీ నేత నారా లోకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విజ‌య్‌ని పోలీసులు అక్ర‌మంగా అరెస్ట్ చేసేందుకు య‌త్నించార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌ పై హైకోర్టు ఎన్ని సార్లు మంద‌లించినా జ‌గ‌న్ స‌ర్కారుకు బుద్ధి రావ‌ట్లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

Exit mobile version