Site icon Prime9

Nara Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ కు నోటీసులు..

ap cid giving notices to nara lokesh in amaravathi inner ring road case

ap cid giving notices to nara lokesh in amaravathi inner ring road case

Nara Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో  తెదేపా ముఖ్య నేత నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి గతేడాది కేసు నమోదవ్వగా..  ఇటీవలే ఏ14గా లోకేశ్ పేరును సీఐడీ అధికారులు చేర్చారు. అక్టోబరు 4వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేశ్ హైకోర్టును ఆశ్రయించగా.. తాము 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని సీఐడీ చెప్పడంతో హైకోర్టు లోకేశ్ బెయిల్ పిటిషన్ విచారణను ముగించింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో తాను ఎక్కడున్నదీ నారా లోకేశ్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఏపీ సీఐడీ అధికారులు ఈ మధ్యాహ్నం ఆయనకు నోటీసులు ఇచ్చారు. తొలుత వాట్సాప్ లో నోటీసులు పంపిన సీఐడీ అధికారులు, ఆ తర్వాత లోకేశ్ తాను ఎక్కడున్నదీ చెప్పడంతో గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు.

Exit mobile version