Site icon Prime9

AP Capital: ఏపీ రాజధాని విశాఖపట్నం.. నేనూ మకాం మారుస్తున్నా: వైఎస్ జగన్ సంచలన ప్రకటన

Ys jagan

Ys jagan

AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్వరలోనే విశాఖపట్నం రాజధాని ( Ap Capital) కాబోతుందని జగన్ తెలిపారు.

అంతే కాకుండా తాను కూడా విశాఖపట్నానికి షిఫ్ట్ అవుతున్నట్టు వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో జగన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ఏపీ రాజధాని పై వ్యాఖ్యలు చేశారు. ‘మార్చి 3,4 తేదీల్లో వైజాగ్ లో ఇన్వెస్టర్ల సదస్సు జరగనుంది.

ఆ సదస్సుకు మిమ్మిల్ని సాదారంగా ఆహ్వానిస్తున్నా. త్వరలో విశాఖపట్నం రాజధాని కాబోతోంది. నేను కూడా కొన్ని నెలల్లో అక్కడికి షిఫ్ట్ అవుతున్నా.

మిమల్ని మరోసారి విశాఖలో కలవాలని కోరుకుంటున్నా’ అని జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

విశాఖ రాజధానిగా పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. తమతో పాటు ఇతర కంపెనీల ప్రతినిధులను కూడా తీసుకొచ్చి ఏపీలో డెవలప్ మెంట్ ను ఇన్వెస్టర్లను కోరారు.

 

పెట్టుబడులు కృతజ్ఞతలు

కాగా, ఏపీలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ ఈ సందర్భంగా జగన్ (YS Jagan Mohan Reddy ) కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందించేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు.

ప్రపంచ పటంలో ఏపీని నిలబెట్టడానికి అందరీ సహకారాలు అవసరమన్నారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి.. జగన్ ధన్యవాదాలు తెలిపారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా ఏపీ నెంబర్ వన్ గా ఉందని జగన్ తెలిపారు. పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఏపీ అగ్రస్థానంలో కొనసాగుతుందన్నారు.

సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీకి ఉందని.. 11.43 శాతం వృద్దితో దేశంలోనే వేగంగా రాష్ట్రం వృద్ధి చెందుతోందని తెలిపారు.

సింగిల్ డెస్క్ సిస్టమ్ ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని గుర్తుచేశారు.

 

సుప్రీంలో మూడు రాజధానుల విచారణ

అయితే ఏపీ మూడు రాజధానుల అంశంపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరగనుంది. విచారణ సమయంలోనే ఏపీ కాబోయే రాజధాని విశాఖ అని వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

పెట్టుబడుటకు విశాఖ రావాలని ఆయన ఇన్వెస్టర్లను కోరారు. తాము త్వరలోనే వైజాగ్ కు మారబోతున్నామని వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

విచారణ జరుగుతుండగా సీఎం ఎలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని రాజధాని రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

 

 

Exit mobile version